BREAKING
కేపీఎల్ క్రికెట్ పోటీలు ప్రారంభం అభివృద్ధి లక్ష్యంగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ మేనిఫెస్టో. పెద్దేముల్ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను పీఎస్‌సీఎస్‌గా మారుస్తాం: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 35వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ నామినేషన్.. నయీ నవేలీ మొదటి రోజు వసూళ్లు: యామీ గౌతమ్ మైథలాజికల్ హర్రర్ కామెడీ గ్రాండ్ ఓపెనింగ్! రామాయణ సినిమా రూ. 4000 కోట్ల బడ్జెట్‌పై రాకింగ్ స్టార్ యష్ క్లారిటీ: సెన్సేషనల్ కామెంట్స్ చీరాల చైర్మన్ అభ్యర్థిగా హనీ స్పందన ఖరారు.. సామాన్య కార్యకర్తకు టీడీపీ అవకాశం! రణబాలి సినిమా చూసి థియేటర్‌లోనే బోరున ఏడ్చేసిన మా అమ్మ: విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల శిక్షణా తరగతులను పరిశీలించిన ఆర్టీవో. మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు కోలీవుడ్ దీపావళి బాక్సాఫీస్ సమరం: సూర్య, నయనతార సినిమాల మధ్య హోరాహోరీ పోరు! పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐదో రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె-వినూత్న బిక్షాటనతో నిరసన రోమియో జూలియట్ సినిమా విడుదల వాయిదా: కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్ కళ్యాణదుర్గం టి డీ పి ఎన్నికల ప్రచారం జోరు. 22,27,28 వార్డుల్లో ఇంటింటా ప్రచారం.

చెరువులో పడి మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

Select Suryaa Now
చెరువులో పడి మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

సూర్య,అశ్వారావుపేట, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలచెరువులో కలపాల రామకృష్ణ కుమారుడు కలపాల ప్రవీణ్ దురదృష్టవశాత్తు చెరువులో పడి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుడు ప్రవీణ్ కుటుంబ సభ్యులను కలిసి వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ కష్ట సమయంలో తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ సందర్భంగా తెలియజేశారు.యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోవడం పలువురిని కలచివేసింది. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్, ఆలా సత్తిబాబు, డాక్టర్ వెలుపుల సత్యనారాయణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట