BREAKING
అభివృద్ధి లక్ష్యంగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ మేనిఫెస్టో. పెద్దేముల్ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను పీఎస్‌సీఎస్‌గా మారుస్తాం: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 35వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ నామినేషన్.. నయీ నవేలీ మొదటి రోజు వసూళ్లు: యామీ గౌతమ్ మైథలాజికల్ హర్రర్ కామెడీ గ్రాండ్ ఓపెనింగ్! రామాయణ సినిమా రూ. 4000 కోట్ల బడ్జెట్‌పై రాకింగ్ స్టార్ యష్ క్లారిటీ: సెన్సేషనల్ కామెంట్స్ చీరాల చైర్మన్ అభ్యర్థిగా హనీ స్పందన ఖరారు.. సామాన్య కార్యకర్తకు టీడీపీ అవకాశం! రణబాలి సినిమా చూసి థియేటర్‌లోనే బోరున ఏడ్చేసిన మా అమ్మ: విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల శిక్షణా తరగతులను పరిశీలించిన ఆర్టీవో. మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు కోలీవుడ్ దీపావళి బాక్సాఫీస్ సమరం: సూర్య, నయనతార సినిమాల మధ్య హోరాహోరీ పోరు! పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐదో రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె-వినూత్న బిక్షాటనతో నిరసన రోమియో జూలియట్ సినిమా విడుదల వాయిదా: కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్ కళ్యాణదుర్గం టి డీ పి ఎన్నికల ప్రచారం జోరు. 22,27,28 వార్డుల్లో ఇంటింటా ప్రచారం. కనకదుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే.

మోపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా గిడ్డయ్య యాదవ్ ఖరారు

Select Suryaa Now
మోపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా గిడ్డయ్య యాదవ్ ఖరారు
పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని  మోపాడు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మోరుబోయిన గిడ్డయ్య యాదవ్ పేరును మోపాడు, బలిజపాలెం, కోడిగుంపల పంచాయతీల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏకాభిప్రాయంతో ఖరారు చేశారు. శనివారం పట్టణంలోని శేషమహల్ థియేటర్ ప్రాంగణంలో ఉన్న టీడీపీ ఎంపీపీ అభ్యర్థి పువ్వాడి వెంకటేశ్వర్లు క్యాంపు కార్యాలయంలో మూడు పంచాయతీల నాయకులు, కార్యకర్తలతో అభ్యర్థి ఎంపికపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోపాడు గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షుడు మోరుబోయిన గిడ్డయ్య యాదవ్ అభ్యర్థిత్వానికి మూడు పంచాయతీల నేతలు మద్దతు తెలిపి ఆయన పేరును ఏకగ్రీవంగా ఖరారు చేశారు. అనంతరం తమ నిర్ణయాన్ని పువ్వాడి వెంకటేశ్వర్లకు తెలియజేశారు.
నవంబర్ 3న జరిగే ఎంపీటీసీ ఎన్నికల్లో మోపాడు స్థానంలో టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలని పీవ్వాడి వెంకటేశ్వర్లు సూచించారు. గిడ్డయ్య యాదవ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు మూడు పంచాయతీల్లో సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, టిడిపి మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, ఏఎంసీ చైర్మన్ యారవ రమా శ్రీనివాస్, మండల టిడిపి నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, పువ్వాడి రామారావు, ఏఎంసి వైస్ చైర్మన్ పాలపర్తి వెంకటేశ్వర్లు, యారవ ప్రసాద్ రెడ్డి మోపాడు రిజర్వాయర్ వైస్ చైర్మన్ మోరు బోయిన నరసింహారావు, పునుగుపాటి మాల్యాద్రి, రేగలగడ్డ కోటయ్య, పచ్చవ బాబు, తెల్లజాల ప్రసాద్, కొప్పల్లి నాగేశ్వరరావు, తిరుపతిరెడ్డి, నాగయ్య, మూడు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.