శ్రీ సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ
పుట్టపర్తి. సూర్య న్యూస్: ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయిబాబా మహా సమాధిని సినీ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక లు దర్శించుకున్నారు. విజయదశమిని పురస్కరించుకొని ప్రశాంతి నిలయంలో జరుగుతున్న వేద పురుష సప్తహా జ్ఞాన యజ్ఞంలో వారు పాల్గొన్నారు. గురువారం సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లు శ్రీ సత్య సాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న అనంతరం,
వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం కొనసాగుతున్న వేళ యజ్ఞ కార్యక్రమాలను వీక్షించి, వేద పండితుల ఆశీర్వాదం పొందారు. పుట్టపర్తిలో విద్యాభ్యాసం చేసిన రోజుల్ని స్మరించుకుంటూ, గతంలో యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితులతో కలిసి పవిత్ర వేద మంత్రాలను జపించిన అనుభూతులను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రశాంతి నిలయాన్ని దర్శించాలన్న తన చిరకాల కోరిక ఈ సందర్భంగా నెరవేరిందని రష్మిక ఆనందం వ్యక్తం చేశారు. మురళీకృష్ణ.. శ్రీ సత్యసాయి జిల్లా.. సీనియర్ జర్నలిస్ట్..