BREAKING
అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలి..పర్ణశాల పంచాయతీ తీర్మానం. ఆదర్శ కుటుంబం విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన నిర్మాత నాగవంశీ: వెంకటేశ్ చేతుల మీదుగా అధికారిక ప్రకటన! టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి... బ్లాస్టింగ్‌కు ప్రయత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్

గౌడ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి. పీసీసీ అధ్యక్షుడు -విద్యతోపాటు సంస్కృతి,

Select Suryaa Now
గౌడ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి. పీసీసీ అధ్యక్షుడు -విద్యతోపాటు సంస్కృతి,

పటాన్‌చెరు, గౌడ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆకాంక్షించారు. విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని పేర్కొన్నారు.
శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం నందిగామ గ్రామంలో చక్రవర్తి గౌడ్ ఆధ్వర్యంలో నిర్మించిన గౌడ హాస్టల్ నూతన భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, వీరేందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్‌తోపాటు గౌడ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి చదువుకునే విద్యార్థులకు వసతి సౌకర్యాలు ఎంతో అవసరమని, అలాంటి అవసరాలను తీర్చడంలో హాస్టళ్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తే వారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

భూదాత లక్ష్మీనారాయణ గౌడ్ ఆదర్శప్రాయుడు

గౌడ విద్యార్థుల విద్యాభివృద్ధికి హాస్టల్ భవనం అందుబాటులోకి రావడం అభినందనీయమని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సదుపాయాల కల్పనకు ముందుకు రావడం సామాజిక బాధ్యతకు నిదర్శనమన్నారు. హాస్టల్ నిర్మాణానికి భూమి అందించిన భూదాత లక్ష్మీనారాయణ గౌడ్ సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థుల అభ్యున్నతికి సహకరించే వ్యక్తులు, సంస్థలు సమాజంలో మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

సామాజిక అభివృద్ధికి విద్యే పునాది

గౌడ సమాజం విద్య, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. యువత విద్యలో రాణించడంతోపాటు తమ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నందిగామలో గౌడ హాస్టల్ నూతన భవనం అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు వసతి పరంగా ప్రయోజనం చేకూరనుందని, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న గౌడ సంఘం నాయకులు, ప్రముఖులు హాస్టల్ భవన నిర్మాణానికి సహకరించిన వారిని అభినందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.