BREAKING
అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలి..పర్ణశాల పంచాయతీ తీర్మానం. ఆదర్శ కుటుంబం విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన నిర్మాత నాగవంశీ: వెంకటేశ్ చేతుల మీదుగా అధికారిక ప్రకటన! టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి... బ్లాస్టింగ్‌కు ప్రయత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్

దుత్తలూరులో గంజాయి అక్రమ సాగుపై నెల్లూరు జిల్లా పోలీసుల మెరుపు దాడి!

Select Suryaa Now
 దుత్తలూరులో  గంజాయి అక్రమ సాగుపై నెల్లూరు జిల్లా పోలీసుల మెరుపు దాడి!

దుత్తలూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లాలో గంజాయి అక్రమ సాగు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు మరియు వాటి వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను సమూలంగా అరికట్టేందుకు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల,  ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో దుత్తలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొక్కజొన్న పంట మాటున సాగు చేస్తున్న గంజాయి పంటను డ్రోన్ సాంకేతికత సహాయంతో గుర్తించి, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

*సమాచారం ఆధారంగా ప్రణాళికాబద్ధంగా తనిఖీలు*

తేదీ 15.10.2026న దుత్తలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సాగు జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దుత్తలూరు ఎస్‌ఐ గారు ఉన్నతాధికారులకు సమాచారం అందించి, వారి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి రెవెన్యూ అధికారులను, గ్రామ రెవెన్యూ అధికారులను, సర్వేయర్‌ను మధ్యవర్తులుగా నియమించి, పోలీసు సిబ్బంది మరియు ప్రత్యేక బృందంతో కలిసి సంబంధిత వ్యవసాయ భూమికి చేరుకున్నారు.

*డ్రోన్ సాయంతో బయటపడిన అక్రమ గంజాయి సాగు*

దుత్తలూరు గ్రామ శివారులోని సర్వే నంబర్ 1582-2లో సుమారు 9.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూమిలో మొదట మొక్కజొన్న పంట సాగు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే డ్రోన్ సహాయంతో పరిశీలించగా, మొక్కజొన్న పంట మధ్యలో సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు. గంజాయి మొక్కలకు డ్రిప్ విధానంలో నీటి సరఫరా ఏర్పాటు చేసినట్లు పరిశీలనలో వెల్లడైంది దీని విలువ కోట్లలో  ఉండవచ్చని తెలిపారు పరిశీలించిన అనంతరం అధికారుల సమక్షంలో గంజాయి మొక్కలను పీకించి తగులబెట్టడం జరిగింది.

పోలీసు బృందం ఆ ప్రాంతానికి చేరుకోగానే అక్కడ పనిచేస్తున్న కొందరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వ్యక్తుల ఆచూకీ, గంజాయి సాగులో వారి పాత్ర తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

*అంతర్రాష్ట్ర సంబంధాలపై దర్యాప్తు*

అదుపులోకి తీసుకున్న వ్యక్తులను విచారించిన సమయంలో గంజాయి సాగు వెనుక ఇతర వ్యక్తుల ప్రమేయం, ఆర్థిక సహకారం, పంటను కొనుగోలు చేసేందుకు ముందస్తు ఒప్పందాలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గతంలో గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించిన పరిచయాలు ఉన్న వ్యక్తుల పాత్రపైనా దర్యాప్తు చేపట్టారు.

ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, గంజాయి సాగుకు కొందరు వ్యక్తులు ఆర్థిక సహాయం అందించడం, మరికొందరు పంటను పరిశీలించడం, పంట చేతికి వచ్చిన తరువాత కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు ముందస్తుగా డబ్బులు ఇవ్వడం వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందా, గంజాయి సరఫరా ఏయే ప్రాంతాలకు చేయాలనుకున్నారు, అక్రమ వ్యాపారం వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు ఎవరు అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

*గతంలోనూ గంజాయి వ్యవహారాల్లో పాల్గొన్నట్లు విచారణలో వెల్లడి*

పోలీసుల విచారణలో ఒక నిందితుడు గతంలో వివిధ ప్రాంతాల్లో గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొన్నట్లు వెల్లడించినట్లు సమాచారం. గత పరిచయాలు, ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసినట్లు వచ్చిన వాంగ్మూలాలు, ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సంబంధిత పాత కేసుల వివరాలను ధృవీకరించి, ప్రస్తుత కేసుతో వాటికి ఉన్న సంబంధాన్ని నిర్ధారించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.

*పంట వెనుక ఉన్న వ్యక్తులందరినీ గుర్తించడమే లక్ష్యం*

గంజాయి సాగులో పాల్గొన్నవారు, వారికి సహకరించినవారు, ఆర్థికంగా ప్రోత్సహించినవారు, పంటను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినవారు, రవాణా మరియు విక్రయాల్లో భాగస్వాములైన వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అక్రమ గంజాయి సాగుకు ఉపయోగించిన భూమి, సాగు విధానం, విత్తనాల సమకూర్పు, నీటి సరఫరా ఏర్పాట్లు, ఇతర ఆధారాలను కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు.

*జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల,  స్పష్టమైన ఆదేశాలు*

జిల్లాలో గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల,  పోలీసు అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించాలని, కేవలం పంటను సాగు చేస్తున్న వారితోనే కాకుండా, దాని వెనుక ఉన్న ఆర్థిక వనరులు, సరఫరా మార్గాలు, కొనుగోలుదారులు మరియు ఇతర సంబంధిత వ్యక్తులపై కూడా దృష్టి సారించాలని సూచించారు.

మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం యువత భవిష్యత్తును, సమాజ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిని చట్టప్రకారం కఠినంగా ఎదుర్కొంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

*ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి*

జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు, నిల్వ, రవాణా లేదా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలి. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా పోలీసు కార్యాలయం విజ్ఞప్తి చేస్తోంది