BREAKING
అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలి..పర్ణశాల పంచాయతీ తీర్మానం. ఆదర్శ కుటుంబం విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన నిర్మాత నాగవంశీ: వెంకటేశ్ చేతుల మీదుగా అధికారిక ప్రకటన! టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి... బ్లాస్టింగ్‌కు ప్రయత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: ఎంపీ కేశినేని చిన్ని

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: ఎంపీ కేశినేని చిన్ని

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విద్యావిజ్ఞానం కలగాలని ఆకాంక్షించారు. దర్శనం అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణలో చేపట్టిన ఏర్పాట్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, భక్తులకు ఏదైనా సమస్య ఎదురైతే గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించే వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రద్దీ నియంత్రణ, భద్రత, క్యూలైన్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నాయని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంతోపాటు, వారి సంతృప్తికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉత్సవాల నిర్వహణ కొనసాగుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు భక్తజన సందోహంతో సందడిగా మారాయి.