జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
*జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి*
ఆత్మకూరు /సూర్య న్యూస్: శుక్రవారం గద్వాల జిల్లా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రహమతుల్లా, మున్సిపల్ చైర్మన్ నాగమణి రాజేష్, వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, మాజీ మండల అధ్యక్షులు పరమేష్, జిల్లా నాయకులు తులసి రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.