అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
సర్పంచ్ కాసుల స్వాతి రామకృష్ణారెడ్డి
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాసుల స్వాతి రామకృష్ణారెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లి శ్రీధర్, వార్డు సభ్యులు శ్యామలమ్మ, ప్రవీణ్, యువకులు శంకర్, వెంకటేష్, కిషోర్, శ్రీకాంత్, సంపత్, గోపాల్, కరుణాకర్, హర్ష, నవీన్, జేమ్స్, ఆసుపత్రి సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్ :మేజర్, న్యూస్, కందుకూరు.