BREAKING
బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలి..పర్ణశాల పంచాయతీ తీర్మానం. ఆదర్శ కుటుంబం విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన నిర్మాత నాగవంశీ: వెంకటేశ్ చేతుల మీదుగా అధికారిక ప్రకటన! టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి... బ్లాస్టింగ్‌కు ప్రయత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్ మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో మాణిక్యం

ఆర్.ఎం.పి, పి.ఎం.పి వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Select Suryaa Now
ఆర్.ఎం.పి, పి.ఎం.పి వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

తొర్రూరు, మేజర్ న్యూస్, గ్రామీణ వైద్యులందరూ సంఘటితంగా ఉండి సమస్యల పరిష్కారానికి సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఆర్ఎంపీ పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ పాలకుర్తి నియోజకవర్గం అధ్యక్షులు మల్లేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచారి లు అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో తొర్రూరు మండల గ్రామీణ వైద్యుల కమిటీని నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగారపు భీమయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షులు గడ్డం రాజమౌళి ల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొర్రూరు మండల అధ్యక్షుడిగా గద్దల వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన్యం వెంకన్న, ప్రధాన కార్యదర్శి గా కొమ్మనబోయిన యాకయ్య, కోశాధికారి మంగళపల్లి ప్రకాష్, ఉపాధ్యక్షులుగా సహాయ కార్యదర్శులుగా కార్యవర్గ సభ్యులుగా నియోజకవర్గ అధ్యక్షులు మల్లేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచారి జిల్లా కార్యదర్శి  అన్నపురపు వెంకన్న లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటితంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశంలో గ్రామీణ వైద్యులు జిలకర నాగన్న, నిమ్మల శీను, మదనాచారి, అబ్దుల్లా, పల్లె రవి, రాము గౌడ్, దామోదర్, వినమాల రవి, గుండాల వేణు, యాకన్న, సందీప్, ఐలయ్య, సిద్ధూ, నితీష్, రాజేష్, మరో 20 మంది గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: సురేందర్ ,తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా