సూర్య కరీంనగర్ ప్రతినిధి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గురువారం శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవారు పండ్ల అలంకరణలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే రామారావుపటేల్, కలెక్టర్ చిత్ర మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందారు. లలితా త్రిపుర సుందరీ దేవి ఆరాధనతో జ్ఞానం, మనశ్శాంతి, కుటుంబ సౌభాగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.