రేణిగుంటలో ఎన్నికల కోడ్ అమలు..
రేణిగుంటలో ఎన్నికల కోడ్ అమలు..
రేణిగుంట మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా రేణిగుంటలో రాజకీయ నాయకుల విగ్రహాలు, పార్టీ గుర్తులను పోలిన చిహ్నాలకు అధికారులు ముసుగులు వేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ఈ కార్యక్రమంలో వేంకటేష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.