కర్నూలు జీవీ మాల్లో భారీ అగ్నిప్రమాదం
కర్నూలు, సూర్య ప్రతినిధి ;నగరంలోని పార్క్ రోడ్డు వద్ద ఉన్న జీవీ మాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాల్ ముందు భాగంలో మంటలు వ్యాపించడంతో ప్లెక్సీలు దగ్ధమై, ముందువైపు పూర్తిగా కాలిపోయింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మాల్ సిబ్బంది దోమల నివారణ కోసం మంటలు పెట్టడంతో అవి సమీపంలోని ప్లెక్సీలకు వ్యాపించి అగ్నిప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, జరిగిన నష్టం పైన విచారిస్తున్నారు..