పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించాలి:
సంగారెడ్డి ; తెలంగాణ వీరయోధుడు, ప్రజల పక్షాన నిలిచిన పోరాట యోధుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను సంగారెడ్డి జిల్లాలో అధికారికంగా, అత్యంత ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు, సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు సంగారెడ్డి కలెక్టరేట్లో బిసి వెల్ఫేర్ అధికారి జగదీష్ కి వినతిపత్రం పులిమామిడి రాజు ఆధ్వర్యంలో సమర్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 22న నిర్వహించనున్న పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం పూర్తి ప్రోటోకాల్తో నిర్వహించాలని పులిమామిడి రాజు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 'రాబిన్హుడ్'గా పేరుగాంచిన పండుగ సాయన్న పోరాట స్ఫూర్తిని, త్యాగాలను భావితరాలకు తెలియజేసేలా జయంతి వేడుకలను నిర్వహించాలని సూచించారు.
పండుగ సాయన్న జయంతి, వర్ధంతి వేడుకలను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1217 జారీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కూడా వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.అదేవిధంగా, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు నీలం మధుకు ఎమ్మెల్సీ పదవి కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు పులిమామిడి రాజు తెలిపారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించి, తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా నాయకులు మరియు తెర్పొల్ సర్పంచ్ సతీష్ ముదిరాజ్ మరియు ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు జనార్ధన్, ఈశ్వర్, బొట్టు వెంకన్న, గుణాకర్, శ్రీనివాస్, తిర్మల్, రామ క్రిష్ణ, సాయి కిరణ్, ఆనంద్, గవ్వల కేశవ్, సుధాకర్, రాజేష్, బస్వరాజ్, మండల నాయకులు యువ నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.