జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రకృతిలో లభించే రంగురంగుల పూలను పేర్చి దేవతగా పూజింపబడే బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొమరం భీమ్ ప్రాజెక్టు ఒడ్డున జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలను జిల్లా ఎస్పీ నితి కా పంత్ జిల్లా అటవీ శాఖ అధికారి జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్ కాగజ్నగర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు లతో కలిసి గౌరమ్మను పూజించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలను ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన కొమరం భీమ్ ప్రాజెక్ట్ ఒడ్డున నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతం యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతుందని, మహిళల ఐక్యతకు, ప్రకృతి పట్ల ఆరాధనకు, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించాలని, సాంప్రదాయమైన పాటలు పాడుతూ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం చాలా సంతోషకరమని తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్, ఐ కె పి సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.