BREAKING
చిలీ స్పెన్స్ రాగి గని యూనియన్‌పై బిహెచ్‌పి పిటిషన్ డాటా సెంటర్ల బూమ్‌తో దూసుకెళ్తున్న స్నైడర్ ఎలక్ట్రిక్ ఐయూ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఐరోపా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన రష్యా 'కాక్రోచ్ మూవ్‌మెంట్' ఆందోళనల నేపథ్యంలో దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సద్దుల బతుకమ్మకు రాజంపేటలో ఏర్పాట్లు పూర్తి ఉక్రెయిన్‌కు అదనంగా 5 కోట్ల యూరోల ఆర్థిక సహాయం అందించనున్న జర్మనీ మూల నక్షత్ర వేడుకలకు పటిష్ట బందోబస్తు. ఎస్పీ జానకి షర్మిల : అంతర్జాతీయ రంగానికి ఆచరణాత్మక కార్యాచరణే లక్ష్యం యూరప్ బాండ్ మార్కెట్‌లో కలకలం నగరం మండలంలో రిజర్వుడు గ్రామ పంచాయతీలు లో వోల్టేజ్ సమస్యకు చెక్ బ్రిటన్ కొత్త ఆర్థిక మంత్రి చాన్స్ లీ తొలి బడ్జెట్ బతుకమ్మ సంబురాల్లో మహిళలతో కలిసిమెలిసి సందడి చేసిన మెచ్చా నాగేశ్వరరావు భద్రాచలం నూతన ట్రాఫిక్ ఎస్ఐగా పడాల కేశవ. ప్రయాణ ప్రాంగణమా? మురుగు నిలయమా?

ప్రజా సమస్యలపై రాచమల్లు దంపతుల క్షేత్రస్థాయి పర్యటన… అధికారుల తీరుపై ఆగ్రహం

Select Suryaa Now
ప్రజా సమస్యలపై రాచమల్లు దంపతుల క్షేత్రస్థాయి పర్యటన… అధికారుల తీరుపై ఆగ్రహం

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: ప్రొద్దుటూరు పట్టణంలోని 26వ వార్డులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి మాజీ కౌన్సిలర్ రాచమల్లు రమాదేవి శుక్రవారం ఉదయం పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతకుమారి వీధి, ఆకులోళ్ల వీధిలో నెలకొన్న పారిశుధ్య సమస్యలను స్థానిక ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చారు. గత రెండున్నరేళ్లుగా కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో  కాలువల శుభ్రతపై అధికారులకు హడావుడి మొదలైందా? రెండున్నరేళ్లుగా పట్టించుకోని సమస్య ఇప్పుడు మాత్రమే ఎందుకు గుర్తుకొచ్చింది? అంటూ స్థానికంగా చర్చ సాగుతోంది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారం కోసం రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, రాచమల్లు రమాదేవి క్షేత్రస్థాయిలో పర్యటించారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా