BREAKING
ఒడిశాలో మరో 2.91 లక్షల గ్రామీణ ఇళ్ల నిర్మాణం: 'అంత్యోదయ గృహ యోజన'ను 2029 వరకు పొడిగించిన మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం! ధర్మ రక్షణకు అవసరమైతే బాంబులు, ఫిరంగులు ప్రయోగిస్తాం.. సీఎం యోగి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మద్దతు! మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నందిగామలో గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాంకాక్‌లో నిర్మలా సీతారామన్ కీలక సంభాషణ: అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్షిక సదస్సులో మైఖేల్ కుగెల్‌మన్‌తో భారత ఆర్థిక వృద్ధి, గ్లోబల్ సరఫరా గొలుసులపై చర్చ! దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రి వివేక్ వెంకటస్వామి రాక జ్ఞాన సరస్వతిగా దుర్గ మాత వైభవంగా బోనాల ఉత్సవాలు అయోధ్య రామాలయ ప్రాంగణంలో అమరవీరుల స్మారకం నిర్మాణం పూర్తి: త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు.. నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడి! వైభవంగా దేవి శరన్నవరాత్రులు హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి ప్రభుత్వ జీవో జారీ పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించాలి: రెండేళ్లకు గిరిజన యువతికి కొత్త జీవితం: సుక్మా బాధితురాలికి కృత్రిమ కాలు అమర్చిన ప్రభుత్వం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు చోదిమళ్ళ లో సాయి నక్షత్ర మాలిక, స్థవణ మంజరి పారాయణం అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. భక్తులకు అన్నీ ఏర్పాట్లు

జిల్లాలో జలసిరి లో చేపట్టిన పనులు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఏర్పాటు చెయ్యాలని

Select Suryaa Now
జిల్లాలో జలసిరి లో చేపట్టిన పనులు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఏర్పాటు చెయ్యాలని

సిద్దిపేట ;   జిల్లాలో జలసిరి లో చేపట్టిన పనులు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఏర్పాటు చెయ్యాలని, విబిజి-రామ్ జి పనులలో కూలీల శాతం పెంచాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగం పెంచడం తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ ప్రక్రియ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి* ఎంపిడిఓ లను ఆదేశించారు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జలసిరి చేపట్టిన పనులు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పై ఎంపీడీవోలు, ఎంపీఓ, ఏపిఓలు, హౌసింగ్ ఏఈ లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. విబిజి-రామ్ జి పథకం ద్వారా "జలసిరి* " కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంటకుంట, ప్రతి గ్రామానికి నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షపు నీరు వృథాగా పోకుండా అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలన్నారు. నీటి సంరక్షణ పనులను మండలం వారిగా ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామంలో రైతులను, ప్రజాప్రతినిధులను, అధికారులందరూ సమన్వయ పరిచి ఇచ్చిన లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలని ఆదేశించారు. ఎల్ నీ నో ప్రభావం అతి తీవ్రంగా ఉన్నందున రాబోయే రభి సీజన్లో పంటలకు ఇబ్బందులు లేకుండా, వాతావరణ మార్పుల అనుగుణంగా పంటలను ఆరుతడి పంటలకు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రైతు ఫార్మ్ పాండ్ లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు.విబిజి-రామ్ జి పనులలో జిల్లాలో కూలీల శాతం 20 మాత్రమే ఉందని వచ్చే వారంలో 40 కి పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో ఏపిఓ లు 8 గంటలు వరకు  క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో పర్యవేక్షించాలని ఆదేశించారు.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి పైన సమీక్ష నిర్వహించారు. గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక సమస్యలు వస్తె గెజిటెడ్ ఆఫీసర్ రిమార్క్ రాయాలని తెలిపారు. మండలాల గ్రామాల వారిగా ఎన్ని శాంక్షన్, ఎన్ని మార్కింగ్, నిర్మాణంలో ఎన్ని బేస్ మెంట్, స్లాబ్, గోడల స్థాయిలో, పే మెంట్ వివరాలు, మార్కింగ్ చేసుకుని నిర్మాణం ఆపేసిన గృహాలు వంటి వివరాలను అధికారులతో ఆరా తీశారు. మండల పరిషత్ అధికారులు గృహ నిర్మాణ ఇంజనీరింగ్ అధికారులే గ్రామాల వారిగా లబ్ధిదారులను కలిసి నిర్మాణం లోని గృహాలను వేగంగా పూర్తి చేయించాలని మార్కింగ్ చేసుకుని ఇంటి నిర్మాణం ప్రారంభించని వారు పనులు మొదలు పెట్టాలని శాంక్షన్ అయిన కూడా ఇప్పటి వరకు మార్కింగ్ చేసుకుని లబ్ధిదారులు మార్కింగ్ చేసుకునేలా పని చెయ్యాలని ఆదేశించారు. మార్కింగ్ పెండింగ్ ఉన్నవి పనులు మొదలు పెట్టాలని లేనియెడల డిలీట్ చెయ్యాలని ఆదేశించారు.గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించి గ్రామాల్లో మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా పండుగ జరుపుకునేలా స్ట్రీట్ లైట్లు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేసేలా స్థానిక సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ లకు సమావేశం నిర్వహించి సూచనలు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సిఈఓ రమేష్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, హౌసింగ్ పిడి భగవంత్ రావు తదితరులు పాల్గొన్నారు.