BREAKING
బ్యాలెట్ ఓటింగ్ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ. రాజమహేంద్రవరం జీఎమ్‌సీలో ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం: ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన పక్షవాత నివారణ, ముందస్తు లక్షణాల గుర్తింపుపై సమగ్ర అవగాహన సదస్సు ఫోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం కూటమి అభ్యర్థుల గెలుపుకై మాచాని ప్రచారం ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి *వస్తున్న మీకోసం.. కార్యక్రమం* గృహప్రవేశ కార్యక్రమంలో టిడిపి నేతలు. జాహ్నవి రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం అక్రమ మొరం తరలింపును అడ్డుకున్నందుకు సర్పంచ్‌పై దాడి:మొమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్థ్య మహిపాల్ విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ ‘బత్తా’ ఓటీటీ రిలీజ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సర్వం సిద్ధం! బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డిమాండ్ కాఫీ విత్ కరణ్’ షోలో అలా ప్రవర్తించి ఉండకూడాల్సింది.. అజయ్ దేవగణ్‌ను చూసి నేర్చుకుంటానన్న వరుణ్ ధావన్! మాధురీ దీక్షిత్‌తో కలిసి అడుగులేసిన శార్వరి.. 'యే ప్రేమ్ మోల్ కియా' డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్! సూర్య కథనానికి స్పందన :చింతపట్లలో బోరు మోటార్ కనెక్షన్ తొలగింపు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

పాతూరు కూరగాయల మార్కెట్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
పాతూరు కూరగాయల మార్కెట్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

 

అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతూరు కూరగాయల మార్కెట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మేయర్ అభ్యర్థి చిట్లూరి రమేష్, 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నసీమా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్ అభ్యర్థులతో కలిసి ప్రజలను అభ్యర్థించారు.

మార్కెట్‌లో వ్యాపారులు, స్థానిక ప్రజలతో మాట్లాడిన రమేష్, నగరంలో మౌలిక సదుపాయాలు, శానిటేషన్, రోడ్లు, నీటి సరఫరా వంటి అంశాలపై ప్రాధాన్యతతో పనిచేస్తామని అన్నారు. అనంతపురం నగర సమగ్ర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి నసీమా మాట్లాడుతూ.. 11వ డివిజన్ ప్రజల సమస్యలను దగ్గరగా గమనించి పరిష్కరిస్తానని, వారి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక అవసరాలపై దృష్టి సారించి ప్రజలకు న్యాయమైన సేవలు అందించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

ఈ ప్రచారంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.