పాములపాడు లో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సురేష్ ప్రచారం
పాములపాడు మేజర్ న్యూస్: పాములపాడు మండల పరిధిలోని భానుముక్కల, బానుకచెర్ల, ఎర్రగుడూరు, మిట్టకందాల గ్రామాల్లో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను, గ్రామస్తులను కలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలతో మాట్లాడి తన అభ్యర్థిత్వాన్ని పరిచయం చేసుకున్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరీం భాష, పాములపాడు సొసైటీ చైర్మన్ రాయపాటి గోవిందు ఉన్నం రాము బండ్లమూరి వెంకటేశ్వరరావు, ప్రతాప్ రెడ్డి, బండ్లమూరి శేఖర్ దితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.