BREAKING
హార్ముజ్ జలసంధిలో ఎరువుల సరఫరా ప్రణాళిక అమలు కాకపోతే ప్రపంచ ఆహార సంక్షోభం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న హర్ష చెముడు వెబ్ సిరీస్! సెప్టెంబర్‌లో పెరిగిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గోపీచంద్ ‘భరతవర్ష’ నుంచి నవదుర్గల వైభవంగా ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్.. ఆధ్యాత్మిక శోభలో ట్రెండింగ్! ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన పోప్ లియో నాగచైతన్య, దుల్కర్ లాంచ్ చేసిన ‘డోంట్ స్లీప్’ టీజర్.. హాలీవుడ్ రేంజ్‌లో సైకలాజికల్ థ్రిల్లర్! రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం ఓటీటీలో తగ్గేదేలే అంటున్న స్లైస్ ఆఫ్ లైఫ్ వెబ్ సిరీస్‌లు.. దుపహియా సీజన్ 2 సరికొత్త రికార్డులు! వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్ వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం సందీప్ కిషన్ ‘కరికాల’ మూవీలోకి గాయత్రి భరద్వాజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్! స్మార్ట్‌ కార్డులపై గ్రామాల పేర్లు నమోదు చేయాలి!

పామూరు ముంగిట్లోకి ‘ఊపాస్‌’ ఎముకల వైద్యం!

Select Suryaa Now
పామూరు ముంగిట్లోకి ‘ఊపాస్‌’ ఎముకల వైద్యం!

 

పామూరు, మేజర్ న్యూస్ : ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న పామూరు ప్రాంత ప్రజలకు ఒంగోలులోని ప్రసిద్ధ ‘ఊపాస్‌’ అత్యున్నత ప్రత్యేక ఆసుపత్రి వైద్య సేవలు ఇకపై స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ కీళ్ల మార్పిడి, సూక్ష్మరంధ్ర శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్‌ ప్రకాష్‌ చవల ప్రతినెలా మొదటి, మూడో గురువారాల్లో పామూరులో రోగులను ప్రత్యక్షంగా పరీక్షించి వైద్య సేవలు అందించనున్నారు. పట్టణంలోని  కందుకూరు రోడ్డులోని అశ్విని ఆసుపత్రి వేదికగా ఈ ప్రత్యేక వైద్య విభాగాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డాక్టర్‌ ప్రకాష్‌ చవల అందుబాటులో ఉండి రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు, చికిత్సలు అందించనున్నారు.

కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, అధునాతన సూక్ష్మరంధ్ర సర్జరీలు, క్రీడాకారులకు తగిలే అంతర్గత గాయాలు, విరిగిన ఎముకలకు ఆధునిక ఆపరేషన్లతో పాటు అత్యవసర రోడ్డు ప్రమాద బాధితులకు అవసరమైన అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

పేద, మధ్యతరగతి రోగులకు డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం ద్వారా ఆధునిక వైద్యం పూర్తిగా ఉచితంగా అందుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం, కేంద్ర టెలికాం ఉద్యోగుల పథకం, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ఆరోగ్య భద్రత పథకాలతో పాటు ప్రముఖ సంస్థలకు చెందిన ప్రైవేటు ఆరోగ్య బీమా సదుపాయాలు కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఎముకలు, కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పామూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందస్తు పేర్ల నమోదు, ఇతర వివరాలకు 9177902666, 7993889427 చరవాణి నంబర్లలో సంప్రదించాలని అశ్విని హాస్పిటల్ డాక్టర్ గద్దె ఏడుకొండలు తెలిపారు.