ఓట్ల చోరీపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టా? కాంగ్రెస్ పోరాటం ఆగదు
వేంపల్లె మేజర్ న్యూస్:
ఓట్ల చోరిపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టా? ఏపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని అడ్డుకోవడమేనా! ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పోరాటం ఆగదు అని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మూలంరెడ్డి దృవకుమార్ రెడ్డి మండిపడ్డారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా రాజ్ భవన్ కు శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఏపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని కూటమి ప్రభుత్వం పోలిసుల ద్వారా హౌస్ అరెస్ట్ చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ఓటు హక్కుపై ప్రశ్నలు లేవనెత్తడం నేరం కాదన్నారు. ప్రజల తరపున గొంతెత్తే నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమన్నారు. ఓట్ల చోరిపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, ప్రజల గొంతును అణచివేయడం సిగ్గుచేటన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యమే శాస్వతమని వెల్లడించారు. ప్రజల ఓటు హక్కును, ప్రశ్నించే హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తోందన్నారు.
గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.