BREAKING
టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య నాణ్యమైన తాగునీరందించడమే లక్ష్యం.. 13 వ వార్డు లోనాగవంశం కులస్తులకు వైసిపి టికెట్ కేటాయించాలి తమిళనాడు బాలికల టైటిల్‌ నిలబెట్టుకుంది.. రాజస్థాన్‌దే బాలుర కిరీటం

ఒంగోలు అభివృద్ధికి రూ.5.40 కోట్ల పనులు

Select Suryaa Now
ఒంగోలు అభివృద్ధికి రూ.5.40 కోట్ల పనులు

ముక్తినూతలపాడు, గుడిమెళ్లపాడులో అభివృద్ధి పనులకు శ్రీకారం

గ్రామాల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే దామచర్ల

నాణ్యతతో నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి

ఒంగోలు,మేజర్న్యూస్  :  నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఆదివారం ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు, గుడిమెళ్లపాడు గ్రామాల్లో రూ.5.40 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముక్తినూతలపాడు గ్రామంలో కిమ్స్ ఆసుపత్రి మీదుగా వచ్చే రహదారిపై ఎన్‌ఎస్‌పీ కెనాల్‌పై రూ.20 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో రూ.40 లక్షలతో సీసీ డ్రైన్లు, రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు రూ.2 కోట్లతో చేపట్టిన త్రీఫేజ్ విద్యుత్ పనులను ప్రారంభించారు. ముక్తినూతలపాడు నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ.90 లక్షలతో తారు రోడ్డు, ముక్తినూతలపాడు నుంచి గుడిమెళ్లపాడు మీదుగా దసరాజుపల్లె వరకు రూ.1.80 కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా ముక్తినూతలపాడులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు బండారు మదన్, డివిజన్ అధ్యక్షుడు రామాంజినేయులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.