BREAKING
మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక

ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి... రామానుజ పల్లి పంచాయతీని అభివృద్ధి చేస్తా... సర్పంచ్ అభ్యర్థి పి సుధా

Select Suryaa Now
ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి...  రామానుజ పల్లి పంచాయతీని అభివృద్ధి చేస్తా...  సర్పంచ్ అభ్యర్థి పి సుధా

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్:
తనకు ఒక్క అవకాశం ఇచ్చి రామానుజ పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలిపిస్తే పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని సర్పంచ్ అభ్యర్థి పి సుధా ఓటర్లను విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రామానుజ పల్లి పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ, తదితర ప్రాంతాలలో సర్పంచ్ అభ్యర్థి పి సుధా ఇంటింటా ప్రచారం చేసి వరుస నెంబర్ 2 కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో అస్తవ్యస్తంగా ఉన్న కాలువలను అండర్ డ్రైనేజ్ సిస్టం లోకి మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అవసరమైనన్ని బోర్లు వేయిస్తానని పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా సాయం కావాలన్నా తాను ముందుండి సహాయ సహకారాలు అందించడంలో తన వంతు సాయం అందిస్తానన్నారు. కావున పంచాయతీ ఓటర్లందరూ ఒక్కసారి ఆలోచించి అభివృద్ధిని కాంక్షించే పీ. సుధా ను సర్పంచ్ గా గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.ఈ ప్రచారం లో  మాజీ సర్పంచ్ పొట్టేలి రవి కుమార్, మాజీ ఉప సర్పంచ్ టి. మునిరెడ్డి, టి మునిశేఖర్,పొట్టేలి సోమశేఖర్, పొట్టేలి మునిరత్నం, ఏం. మోహన్ రెడ్డి, పీ. మునికృష్ణారెడ్డి, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.

H. Dwaraka, staff reporter 

9705347341