BREAKING
ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 'మయూఖ'.. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లో టాప్ ట్రెండింగ్ నార్త్ రాజుపాలెం 10వ వార్డులో ఎన్నికల వివాదం.. వికాస్ వివాహ వేడుకకు విచ్చేసిన అతిథులకు కంచర్ల భాస్కరరావు కృతజ్ఞతలు రాజ‌ధానిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(FSI) పెంపుపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ లోక్‌సభ సీట్ల 50% పెంపు చరిత్రాత్మక నిర్ణయం: సీఎం చంద్రబాబు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.. నూతన అధ్యక్షుడిగా ఆలీ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేత విద్యార్థి దశ నుండి మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి పల్లెల ప్రగతి కూటమితోనే సాధ్యం విద్యుత్ శాఖ వారి పత్రికా ప్రకటన కోలంకలో ఘోర రోడ్డు ప్రమాదం ఈఠా సినిమా కోసం శ్రద్ధా కపూర్ బరువు పెరుగుదల.. వైభవీ మర్చంట్ ఆసక్తికర వ్యాఖ్యలు శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణం

న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలి!

Select Suryaa Now
న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలి!

- రూ.5 లక్షల బీమా కల్పించాలి

- జూనియర్ లాయర్లకు రూ.10 వేల స్టైఫండ్ ఇవ్వాలి

- కోర్టుల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి

- బార్ కౌన్సిల్ చైర్మన్‌కు ఉమ్మడి జిల్లా న్యాయవాదుల వినతి

- ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్న బాలాజీ

సూర్య బ్యూరో – కాకినాడ : 

న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదులు కోరారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టి.పృథ్వీరాజ్ నేతృత్వంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ యలమంజుల బాలాజీని కలిసి వినతిపత్రం అందజేశారు.

న్యాయవాదులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల స్టైఫండ్ అందించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు బాలాజీ సానుకూలంగా స్పందిస్తూ వారి విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.

జస్టిస్ జయసూర్యతో న్యాయవాదుల భేటీ

అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ నయనాల జయసూర్యను న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. టి.పృథ్వీరాజ్‌తో పాటు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు జేవీ రమణ, సామిరెడ్డి నాగభూషణం, హైకోర్టు న్యాయవాది కేఎన్‌డీవీ రమణారావు, ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.