BREAKING
జలసిరి నీటి కుంటల్లో గంగపుత్రులకు చేపల పెంపకానికి అవకాశం కల్పించాలి వరుణ దేవుని యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కరెంటు బిల్లుల భారంపై హరీశ్‌రావు ఫైర్: "పండుగల ముందు ప్రజలకు పిడుగు లాంటి వార్త" కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించిన శంకు కృపారావుకు వర్ల రామయ్య అభినందనలు పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి- మంత్రి ఫరూక్ కి సిపిఎం వినతి "సేవా సేతు అభియాన్" ద్వారా ప్రజలకు చేరువవుతున్న "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" - ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ జపములు మరియు వరుణ యాగం కడప కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ

నంద్యాలలో పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్

Select Suryaa Now
నంద్యాలలో పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్

-విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మౌలిక వసతుల పరిశీలన

-మంత్రి ఫరూక్ ప్రశ్నలకు చక్కగా సమాధానమిచ్చిన 10వ తరగతి విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న కు సన్మానం

నంద్యాల బ్యూరో:
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మరింత బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ సోమవారం నంద్యాల పట్టణంలోని పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పట్టణంలోని హోలీ క్రాస్ హైస్కూల్, ఖలీల్ సిద్ధికి హైస్కూల్, సిద్ధికి ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ తదితర మూడు పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల హాజరు, పాఠశాల రోజువారీ నిర్వహణ మరియు ఎదుర్కొంటున్న సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లోని విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన మంత్రి ఫరూక్ , వారి అభ్యసన స్థాయిలను తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు వేశారు. ఖలీల్ సిద్ధికి హైస్కూల్ సందర్శన సందర్భంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థిని లక్ష్మీ ప్రసన్నను మంత్రి ఫరూక్ పలు ప్రశ్నలు అడగగా, ఆ విద్యార్థిని ఏమాత్రం తడబడకుండా పుస్తకంలోని అంశాలను సమగ్రంగా వివరించింది. విద్యార్థిని ప్రతిభకు, ధైర్యానికి ముగ్ధుడైన మంత్రి ఫరూక్ , ఆమెను ప్రత్యేకంగా అభినందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి నాణ్యమైన భోజనం విద్యార్థినిలకు అందిస్తున్నారా లేదా అని పరిశీలించాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగ సమగ్ర అభివృద్ధికి, నాణ్యమైన విద్యాబోధనకు కట్టుబడి ఉందని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఇటువంటి క్షేత్రస్థాయి పర్యవేక్షణలు నిరంతరం కొనసాగుతాయని మంత్రి ఫరూక్ తెలిపారు . పాఠశాలల సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సకాలంలో తగిన దిద్దుబాటు చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.