BREAKING
-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్

నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోలింగ్ నిర్వహించాలి : కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ

Select Suryaa Now
నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోలింగ్ నిర్వహించాలి : కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం మేజర్ న్యూస్ : రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు, పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ సూచించారు. ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. శనివారం మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల, పెడనలోని సెయింట్ విన్సెంట్ పల్లోట్టి ఇంగ్లీష్ మీడియం పాఠశాల, ఉయ్యూరులోని సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ జరుగుతున్న తీరును, అక్కడ కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులతో మాట్లాడి ఎన్నికల విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్‌బుక్‌లలో పొందుపరిచిన నిబంధనలను అక్షరాలా పాటించాలని, శిక్షణలో అందించిన సూచనలను మరోసారి గుర్తుచేసుకుంటూ ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల సామగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం ఒక్కొక్కటిగా పరిశీలించి స్వీకరించాలని, ముఖ్యంగా బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ పెట్టెలు, ఇతర సామగ్రి వివరాలు, వరుస సంఖ్యలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న తర్వాత కూడా సామగ్రిని మరోసారి సరిచూసుకుని అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, ఓటర్లకు అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఇదిలా ఉండగా, ఎన్నికల విధులకు హాజరవుతున్న ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి జిల్లా యంత్రాంగం తరఫున 'కృష్ణ కానుక' పేరుతో ప్రత్యేక బహుమతి కిట్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో టూత్ బ్రష్, నాలుక శుభ్రం చేసుకునే పరికరం, టూత్‌పేస్ట్, సబ్బు, బ్రిటానియా కేక్, దోమల నివారణ స్టిక్కులు, మహిళలకు అవసరమైన శానిటరీ న్యాప్‌కిన్స్ తదితర వస్తువులు అందిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన కనీస వ్యక్తిగత వినియోగ వస్తువులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ కిట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల నోడల్ అధికారులు, ఇతర అధికారులు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.