నెట్టేరి ఆలయంలో అక్రమాలు - విచారణ జరిపించాలని రఘునాథచారి డిమాండ్
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:తమ గ్రామంలోని ఆలయంలో పూజలు సక్రమంగా చేయడం లేదని చిత్తూరు జిల్లా నిండ్ర మండలం నెట్టేరి గ్రామానికి చెందిన రఘునాథచారి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తమ గ్రామంలోని ఆలయాన్ని టీటీడీ తన ఆధీనంలో తీసుకుని పూజలు చేస్తోందన్నారు. రాత్రి 8 గంటలకు మూసివేయాల్సిన ఆలయాన్ని సాయంత్రం 7 గంటలకే ఎందుకు మూసివేస్తున్నారని ప్రశ్నించినందుకు తనపై కొందరు దౌర్జన్యం చేశారని వాపోయారు.ఆలయానికి వచ్చే భక్తుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ, ఆ నగదును ఆలయ అవసరాలకు వినియోగించకుండా వ్యక్తిగత పనులకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ విషయంపై ప్రత్యేకంగా విచారణ చేపట్టి, ఆలయంలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలను గుర్తించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రఘునాథ చారి కోరారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్