BREAKING
ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 'మయూఖ'.. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లో టాప్ ట్రెండింగ్ నార్త్ రాజుపాలెం 10వ వార్డులో ఎన్నికల వివాదం.. వికాస్ వివాహ వేడుకకు విచ్చేసిన అతిథులకు కంచర్ల భాస్కరరావు కృతజ్ఞతలు రాజ‌ధానిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(FSI) పెంపుపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ లోక్‌సభ సీట్ల 50% పెంపు చరిత్రాత్మక నిర్ణయం: సీఎం చంద్రబాబు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.. నూతన అధ్యక్షుడిగా ఆలీ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేత విద్యార్థి దశ నుండి మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి పల్లెల ప్రగతి కూటమితోనే సాధ్యం విద్యుత్ శాఖ వారి పత్రికా ప్రకటన కోలంకలో ఘోర రోడ్డు ప్రమాదం ఈఠా సినిమా కోసం శ్రద్ధా కపూర్ బరువు పెరుగుదల.. వైభవీ మర్చంట్ ఆసక్తికర వ్యాఖ్యలు శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణం

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత – కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల

*నెల్లూరు నగరం:*

నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా అడిషనల్ కమిషనర్ శ్రీమతి కె. హిమబిందు గారి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల డివిజన్ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రతి వీధిలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం, స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

సమావేశంలో 21వ డివిజన్ పరిధిలోని సచివాలయ సిబ్బంది పురవిత్ర యాప్ ద్వారా గుర్తించిన సమస్యలు, నమోదు చేసిన ఫిర్యాదులు, వాటి పరిష్కార స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై అడిషనల్ కమిషనర్ కె. హిమబిందు గారు సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సిబ్బందికి సూచించారు.

ప్రధానంగా అండర్ డ్రైనేజీ సమస్యలు, రోడ్లపై ఏర్పడిన గుంతలకు ప్యాచ్‌వర్క్, ఎండ్ టు ఎండ్ రోడ్ల నిర్మాణం, ఎత్తుపల్లాలు లేని రహదారులు, కాలువలు లేని ప్రాంతాల్లో కొత్త కాలువల నిర్మాణం, శానిటేషన్, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

నెల్లూరు నగరాన్ని సుందరమైన, అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారి అభివృద్ధి దృక్పథానికి అనుగుణంగా 21వ డివిజన్‌లో కూడా అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కోరారు. ప్రతి రహదారి సక్రమంగా ఉండాలని, మురుగునీటి సమస్యలు లేకుండా అవసరమైన చోట కాలువల నిర్మాణం చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణ ఉండాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రస్తావించే ప్రజా జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అనే స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, వాటిని సంబంధిత అధికారులకు తెలియజేయడం, పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో డివిజన్‌లో పర్యటించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలను అర్జీల రూపంలో డిప్యూటీ అడిషనల్ మేయర్ గారికి అందజేసి, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.

నగర అభివృద్ధికి మంత్రి పొంగూరు నారాయణ గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రజా జవాబుదారీతనం స్ఫూర్తి, అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ కలిసివచ్చినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, 21వ డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, 21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, నరహరి, బాలు,ఆమని తదితరులు పాల్గొన్నారు.