BREAKING
మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక

నెల్లూరు రూరల్‌లో సత్తా చాటిన కోటంరెడ్డి సోదరులు!

Select Suryaa Now
నెల్లూరు రూరల్‌లో సత్తా చాటిన కోటంరెడ్డి సోదరులు!

నెల్లూరు రూరల్‌లో సత్తా చాటిన కోటంరెడ్డి సోదరులు!

18 పంచాయతీలకు గాను 12 పంచాయతీలు ఏకగ్రీవం..

నాడు కార్పొరేషన్‌లో.. నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వంలో విజయపరంపర

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్:

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సోదరులు మరోసారి తమ రాజకీయ సత్తాను చాటుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు రూరల్ మండలంలోని మొత్తం 18 గ్రామ పంచాయతీలకు గాను 12 పంచాయతీలు ఏకగ్రీవం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగడంతో ఈ ఫలితం సాధ్యమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల్లో పెనుబర్తి, కాకుపల్లి, కలివెలపాలెం, దొంతాలి, గొల్లకందుకూరు, సజ్జాపురం, కొత్త వెల్లంటి, దేవరపాలెం, కొమ్మరపూడి, కొండ్లపూడి, సౌత్ మోపూరు తదితర గ్రామాలు ఉన్నాయి.గతంలో నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో తమ రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకున్న కోటంరెడ్డి సోదరులు, తాజాగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ పట్టును నిరూపించుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించడం ఈ ఏకగ్రీవాల వెనుక కీలకంగా నిలిచిందని కూటమి శ్రేణులు భావిస్తున్నాయి.మొత్తంగా నెల్లూరు రూరల్‌లో 18 పంచాయతీలకు గాను 12 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో కోటంరెడ్డి సోదరుల నాయకత్వం మరోసారి రాజకీయంగా వార్తల్లో నిలిచింది. మిగిలిన పంచాయతీల్లో ఎన్నికల పోరు ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.