నెల్లూరు రూరల్ పెద్దచెరుకూరులో టీడీపీ అభ్యర్థి నాగమణి ఘన విజయం!
నెల్లూరు, మేజర్ న్యూస్ : నాలుగో డివిజన్లో ఎస్టీ రిజర్వుడ్ స్థానాన్ని కైవసం చేసుకున్న మాణికల నాగమణి నెల్లూరు రూరల్ పరిధిలోని పెద్దచెరుకూరు నాలుగో డివిజన్లో ఎస్టీ రిజర్వుడ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాణికల నాగమణి ఘన విజయం సాధించారు. భారీ మెజారిటీతో ప్రత్యర్థిపై ఆధిక్యత సాధించి విజయాన్ని నమోదు చేశారు. నాగమణి గెలుపుతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ విజయోత్సవాలు నిర్వహించారు.