BREAKING
స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఫాక్స్‌కాన్ ద్వారా ఇప్పటికే 300 మందికి ఉపాధి చెన్నైలో సీ ఆర్ రాజన్ నూతన గృహప్రవేశం - హాజరైన ఎమ్మెల్యే జగన్ మోహన్ ప్లాస్టిక్ సర్జరీ వల్లే అలా మారిందంటూ ప్రచారం.. ట్రోల్స్‌పై తీవ్రంగా మండిపడ్డ హాలీవుడ్ నటి ఫ్లోరెన్స్ పుగ్ ఎం వెంకటం పల్లి లో వైసీపీకి షాక్... టిడిపిలో చేరిన ఏడు కుటుంబాలు. విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచేందుకు సీబీఎన్, ఎన్‌ఎన్‌పీసీ ఒప్పందం ఆరుతడి పంటల సాగుపై అన్నదాతలు మొగ్గు చూపాలి : పశుగ్రాసం,పచ్చిరొట్ట ఎరువుల పంటలు సాగు చేయాలి : వ్యవసాయ అధికారులచే రైతులకు అవగాహన పాఠశాలల్లో వంద శాతం హాజరే లక్ష్యంగా కృషి చేయాలి : ఎంఈఓ నిజాముద్దీన్ బ్రంట్ వర్క్‌వేర్‌ను సొంతం చేసుకున్న పెర్మిరా, ఫ్రీమాన్ స్పోగ్లీ కాంగ్రెస్ తోనే నిరుపేదల బతుకు మారుతుంది....! సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే నసీర్ డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు..లోగో, మస్కట్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. నేటి నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం నిన్న వైసీపీ కండువా.. నేడు అమిలినేని సమక్షంలో టిడిపి కండువా వేసుకున్న నాయకులు.

నెల్లూరు రూరల్ ఎంపీపీ పీఠం ఎవరికి?

Select Suryaa Now
నెల్లూరు రూరల్ ఎంపీపీ పీఠం ఎవరికి?

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ :   నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలి (ఎంపీపీ) పీఠం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో దొంతాలి, ఆమంచర్ల గ్రామాల మధ్య రాజకీయ ఆసక్తి నెలకొంది.మండలంలోని దొంతాలి ఎంపీటీసీగా చడమల స్వప్న, ఆమంచర్ల బిట్‌-1 ఎంపీటీసీగా యకసిరి లలిత ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి ఎంపీపీ పదవి దక్కుతుందన్న అంశం ప్రస్తుతం మండల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఒకవైపు దొంతాలి గ్రామం నుంచి చడమల స్వప్న, మరోవైపు ఆమంచర్ల గ్రామం నుంచి యకసిరి లలిత ఎంపీపీ పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనని నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నేడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక

నెల్లూరు రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుల ఎన్నికతో పాటు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం (నవంబర్ 19) నిర్వహించనున్నారు.మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత మండల కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.ఆ తర్వాత చేతులెత్తే విధానంలో ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నారు. తదనంతరం వైస్ ఎంపీపీ ఎన్నికతో పాటు నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారం జరగనుంది.ఎన్నిక ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిసైడింగ్ అధికారి బి. శ్రీదేవి, ఎంపీడీవో వి. శైలేంద్ర కుమార్ తెలిపారు.