BREAKING
ఆదర్శభావాల కలిగిన వారు ఆర్యవైశ్యులు ఇన్-సర్వీస్ టెట్-2 ప్రతిభ చాటిన వి. భరత్ బాబు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించకపోవడంపై పలువురు అసంతృప్తి హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ తీర్మలపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. తెలంగాణ భక్తిని, సంస్కృతిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు రేణూ దేశాయ్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఘాటు స్పందన వెంకటరమణ హిల్స్ కాలనీలో పోటాపోటీగా గణపతి లడ్డూ వేలం పౌర్ణమి పురిష్కరించుకుని వాసవిఅమ్మ వారికి ప్రత్యేక పూజలు. డా. మన్మోహన్‌ సింగ్‌ సేవలు చిరస్మరణీయం దేశ ఆర్థిక ప్రగతికి ఆయన కృషి ఆదర్శనీయం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ రేపు బ్యాంకులు పనిచేస్తాయ్.. మారెమ్మ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.లక్ష విరాళం ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదు రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఓటరు జాబితా సవరణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన గ్రామకంఠం భూములపై సీఆర్‌డీఏ క్లారిటీ భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగ ఘన నివాళులు....

నీటి మునిగిన వెయ్యి ఎకరాల వరి సాగు

Select Suryaa Now
నీటి మునిగిన వెయ్యి ఎకరాల వరి సాగు

నీట మునిగిన వెయ్యి ఎకరాల వరిసాగు 

ఆదుకోవాలంటూ రైతుల వేడుకోలు 

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; మూడు మాసాల వర్షం లేదు. ఈ మూడు రోజుల వర్షానికి వేలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రభుత్వాలు మారుతున్న మా తలరాతలు మారడం లేదంటూ గగ్గోలు పెట్టిన రైతులు. రాష్ట్రంలో తుఫాను బీభత్సం సృష్టించడంతో తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలోని  సుమారు 1100 ఎకరాల వరి పంట నీట మునిగి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా తుఫానుల వల్ల రైతులు విపరీతంగా నష్టపోతున్నామని బాపోయారు. పొట్ట దశకు చేరుకున్న పంట మునిగిపోతుండటంతో పెట్టుబడులు పోయి, కౌలు చెల్లించలేక, చేసిన అప్పులు తీర్చలేక అల్లాడి పోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. నందమూరి అక్విడేట్ వద్ద పేరుకుపోయిన చెత్త వల్ల నీరు వేగంగా ప్రయాణించకపోవడం, వర్షపు నీరు క్రిందకు వెళ్లే మార్గం లేకపోవడంతో ప్రతి యేడాది పంటలు దెబ్బతింటున్నాయని వాపోయారు. ఎకరాకు సుమారు 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు, రెండు పంటలు నాశనం అయిపోయి ఇన్పుట్ సబ్సిడీ రాక ప్రభుత్వం అందించే బీమా, ఎరువులు చాలా ఇబ్బంది పడుతున్నామంటూ వాపోయాను. కౌలు రైతులయితే ప్రభుత్వ సహాయ కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వత పరిష్కారదిశగా హామీ ఇచ్చారు, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎకరాకు పూర్తి స్థాయి నష్టపరిహారం అందించి, ఈ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా రైల్వే బ్రిడ్జి వద్ద తూములు మరియు ఫ్లైఓవర్ ఎత్తు పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

 

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం