నేడు వైకాపా నీటి పోరు..!
★ప్రభుత్వ వైఫల్యమే నీటి సంక్షోభానికి కారణం
★ విశాఖలో తీవ్ర నీటి ఎద్దడి
★ నీరు లేక అల్లాడుతున్న జనం
★ ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమైన వైసీపీ
★ నేడు బిందెలతో జీవీఎంసీ ముట్టడికి వైసిపి సన్నద్ధం
★ భారీగా పాల్గొననున్న ప్రజలు, పార్టీ క్యాడర్
★ మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్
విశాఖలో ఏర్పడిన తీవ్ర నీటి ఎద్దడి కారణంగా ప్రజల అవస్థలు పడుతున్నారు.
ప్రజలకు మంచినీటిని సక్రమంగా సరఫరా చేయడంలో జీవీఎంసీ పూర్తిగా విఫలం కావడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది.
ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే తమ తమ ప్రాంతాలలో వివిధ రూపాలలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని కంటి తుడుపు వాగ్దానాలు చేస్తున్నారు.
విపక్ష పార్టీలు సమస్యపై ప్రజల తరఫున పోరాటం చేపట్టాయి.
వైసిపి వైసిపి నేతలు ఈ విషయంపై కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యం కారంగానే విశాఖలో నీటి సంక్షోభం ఏర్పడిందని ఆ పార్టీ ఆరోపిస్తుంది.
ఇప్పటికే వివిధ ప్రాంతాలలో వైసిపి కేడర్ పోరాటం చేపట్టింది.
ప్రజలు కూడా వీధి పోరాటాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఈ సమస్యపై తీవ్రంగా స్పందించకపోగా, ఎమ్మెల్యేలు ,కూటమి పెద్దలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఏవేవో చెబుతూ ఈ సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నీటి సంక్షోభం వైసీపీకి మాత్రమే ఉందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని సమర్థించుకుంటున్నారు ఎమ్మెల్యే
లు. రాజకీయ ప్రయోజనాల కోసం
విపక్షం చేస్తున్న ఆందోళనల వల్ల స్థానిక ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాదని వ్యాఖ్యానించడం ద్వారా ప్రజల ఇబ్బందిని రాజకీయ కోణంలో చూసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
మరోపక్క
వైసిపి
తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న
విశాఖలో ప్రజల పక్షాన ప్రత్యక్ష ఆందోళనలకు సన్నద్ధమైంది.
నీటి సరఫరా మెరుగు పరచకపోతే జివిఎంసి ముట్టడికి సిద్ధమని ప్రకటించిన విపక్షం మంగళవారం వేలాది మంది మహిళలు, బిందెలతో భారీ ర్యాలీగా తరలి వెళ్లేందుకు రెడీ అయింది.
నిర్ధిష్ట హామీ లభించే వరకు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి కదిలేది లేదనివ్ ప్రకటించడంతో పరిణామాలపై ఉత్కంఠ కనిపిస్తోంది.
ఇదిలావుండగా
రోజువారీ అవసరాలకు కూడా నీరులేక ఒకపక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్
కమ్యూనిటీల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
జీవీఎంసీ ట్యాంకర్ల వైపు క్యూకట్టడంతో వాటికి డిమాండ్ పెరిగిపోయింది.
అనూహ్యంగా పెరిగిన డిమాండ్ కు సరిపడ ట్యాంకర్లను సరఫరా చేసే పరిస్థితి లేదు. దీంతో ప్రైవేటు ట్యాంకర్ల
డిమాండ్ పెరగడంతో ఇప్పుడు విశాఖలో ఇదే పెద్ద వ్యాపారంగా మారగా ప్రజల జేబులకు చిల్లుపడుతోంది.
అయితే
తీవ్ర వర్షాభావ పరిస్థితులు భూగర్భ జలాలను పాతాళంలోకి నెట్టేయడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.
మంచినీటి అవసరాలు తీర్చే రిజర్వాయర్లలో నీటి మట్టాలు డెడ్ స్టోరేజ్ కిందకు పడిపోవడంతో విశాఖలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
దీంతో కుళాయిల ద్వారా నీటిసరఫరా గాడి తప్పింది. బల్క్ వాటర్ కనెక్షన్ తీసుకున్న అపార్ట్మెంట్లు, సముదాయాలకు ముందు ఉన్న స్థాయిలో నీటి సరఫరా జీవీఎంసీకి సవాలుగా మారింది. ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు వస్తున్నాయని ప్రకటిస్తుండగా వ్యవస్థ గాడిలో పడటానికి సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
ఫలితంగా ప్రజలు తాగునీటి ఇబ్బందులు
మరింత పెరగనున్నాయి.
ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోటం వల్ల విశాఖలో నీటి సమస్య మరింత జటిలమైంది.
ఈ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వైసిపి మాత్రం ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.
ప్రజల తరువున ఈ సమస్య తాము చేస్తున్న పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు తెలియజేస్తున్నారు.