BREAKING
పాలకొండ పురపాలక సంఘంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగనాధ్ తోటపల్లిలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ వరి పంటలకు ఆశించే తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలి తూరు మామిడి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా" కొల్లి " అనధికార మద్యం విక్రయిస్తే చర్యలు పాముకాటుకు ఒకరు మృతి..... పురపాలక సంఘం వైసిపి అభ్యర్థులకు బి ఫారాలు అందచేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అక్రమ నగదు, మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా – 24 గంటల పాటు పర్యవేక్షణ రేపు మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకుల రాక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయాలి పాలకొండ నగర పంచాయతీ లో ఛైర్మన్, 17 కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ ఎన్నికల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి: " ముప్పై ఏళ్లు గా పురుషులకు దక్కని యంపిపి పీఠం " కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా: ఎంపీ ఈటల రాజేందర్ టిడిపిలో పలు కుటుంబాలు చేరిక

నవంబర్ 15 నుండి 542 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు

Select Suryaa Now
నవంబర్ 15 నుండి 542 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు

ఏలూరు, మేజర్ న్యూస్ : ఏలూరు జిల్లాలోని 542 గ్రామ పంచాయతీలకు నవంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 3వ తేదీ వరకు  3 దశలలో ఎన్నికలు  నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.  జిల్లాలోని 542 గ్రామ పంచాయతీలలలోని 5676 వార్డ్ మెంబర్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, 5801 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం జరుగుతుందని.  మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనున్న బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కామవరపుకోట, కొయ్యలగూడెం, కుక్కునూరు, పోలవరం, టి. నర్సాపురం, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం మండలాలకు చెందిన 175 గ్రామ పంచాయతీలలో 1876  వార్డ్ మెంబర్లకు సంబంధించి  1993 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం జరిగిందని, వీటికి నామినేషన్లు నవంబర్, 15వ తేదీన విడుదల చేయడం జరుగుతుందని, 17వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.  18వ తేదీన నామినేషన్లు పరిశీలించడం జరుగుతుందన్నారు.  తిరస్కరించిన నామినేషన్లపై 19వ తేదీన అప్పీలు చేసుకోవచ్చని, 20వ తేదీలోగా అప్పీళ్లను పరిష్కరించడం జరుగుతుందన్నారు.  21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని ,  అదే రోజు   తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు.   నవంబర్,26వ తేదీన   ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, అదేరోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు. అవసరమైన పక్షంలో 27వ తేదీన రీపోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. రెండవ  దశలో ఎన్నికలు నిర్వహించనున్న భీమడోలు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నిడమర్రు, ఉంగుటూరు, ద్వారకాతిరుమల మండలాలకు చెందిన 194 గ్రామ పంచాయతీలలో 1972 వార్డ్ మెంబర్లకు సంబంధించి  2024 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం జరిగిందని, వీటికి నామినేషన్లు నవంబర్, 18వ తేదీన విడుదల చేయడం జరుగుతుందని, 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.  21వ తేదీన నామినేషన్లు పరిశీలించడం జరుగుతుందన్నారు.  తిరస్కరించిన నామినేషన్లపై 22వ తేదీన అప్పీలు చేసుకోవచ్చని, 23వ తేదీలోగా అప్పీళ్లను పరిష్కరించడం జరుగుతుందన్నారు.  24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని ,  అదే రోజు   తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు.   నవంబర్,29వ తేదీన    ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, అదేరోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు. అవసరమైన పక్షంలో 30వ తేదీన రీపోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడవ దశలో ఎన్నికలు నిర్వహించనున్న దెందులూరు, ఏలూరు, పెదపాడు, పెదవేగి, అగిరిపల్లి, చాట్రాయి,, ముసునూరు, నూజివీడు మండలాలకు చెందిన 173 గ్రామ పంచాయతీలలో 1828 వార్డ్ మెంబర్లకు సంబంధించి  1844 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం జరిగిందని, వీటికి నామినేషన్లు నవంబర్, 21వ తేదీన విడుదల చేయడం జరుగుతుందని, 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.  24వ తేదీన నామినేషన్లు పరిశీలించడం జరుగుతుందన్నారు.  తిరస్కరించిన నామినేషన్లపై 25వ తేదీన అప్పీలు చేసుకోవచ్చని, 26వ తేదీలోగా అప్పీళ్లను పరిష్కరించడం జరుగుతుందన్నారు.  27వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని ,  అదే రోజు   తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు.   డిసెంబర్, 2వ తేదీన    ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, అదేరోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు. అవసరమైన పక్షంలో డిసెంబర్, 3వ  తేదీన రీపోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.   

         గ్రామ పంచాయతీ  ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి అన్ని అంశాలలో  శిక్షణ అందించడం జరుగుతున్నదన్నారు.  నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు వీడియోలు చిత్రీకరించడం జరుగుతుందని, అంతేకాక  సిసి కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు.  ఎన్నికల నిర్వహణకు  పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో భద్రతకు అదనపు భద్రతా  సిబ్బందిని నియమించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు.

 సూర్య దినపత్రిక జిల్లా ఇంచార్జి పసుమర్తి రాము ఏలూరు,