BREAKING
గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. ప్రతి రైతుకు డిజిటల్ గుర్తింపు.. వ్యవసాయ సేవలకు సరికొత్త భరోసా. ఇండస్ట్రీయల్ ప్రాజెక్ట్ పై వర్క్ షాప్ ఆదివాసీ మహిళకు అగ్రతాంబూలం ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులు క్లియర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి పాలనలోనే ..:ఎమ్మెల్యే బండారు ఎంపీటీసీ రాజ్ కుమార్‌కు ఘన సన్మానం ఆ ఆరోపణలు అవాస్తవం... విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధిపై నారా లోకేష్, రానా దగ్గుబాటి కీలక చర్చ.. సీఐఐ సదస్సులో ఆసక్తికర దృశ్యం! రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు కొత్త రేవుపోలవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! ఏటికొప్పాక కళాకృతుల స్టాల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు తదితరులు మానసిక వికలాంగులకు స్కూల్ సామాగ్రి పంపిణీ

నవంబర్ 14 నుండి 20 వరకు 59వ గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
నవంబర్ 14 నుండి 20 వరకు 59వ గ్రంథాలయ వారోత్సవాలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు జరగనున్న 59వ గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్స్ ను గురువారం ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి గారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో తమ ఛాంబర్ లో గ్రంధాలయ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా చైర్ పర్సన్ మేకపాటి శాంతి కుమారి  మాట్లాడుతూగ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలు, సమాజ అభివృద్ధికి పునాదులు, విద్యార్థులు, యువతలో పఠనాసక్తిని పెంపొందించి, జ్ఞానాన్ని విస్తరించడమే గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు జరగనున్న ఈ వారోత్సవాల ద్వారా పుస్తక పఠనంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను వినియోగించుకునేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి,యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి,తల్లిదండ్రులుపిల్లలకు ఆస్తిపాస్తులతో పాటు పఠనాసక్తిని కూడా వారసత్వంగా అందించాలన్నారు . ఉపాధ్యాయులు విద్యార్థులను గ్రంథాలయాల వైపు ప్రోత్సహించాలని,ప్రజాప్రతినిధులుఅధికారులు గ్రంథాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని,మీడియా ప్రతినిధులు గ్రంథాలయాల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రంథాలయాల అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ వారోత్సవాల నిర్వహణకు ఆమె తనవంతుగా 30వేల రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించే గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమానికి  ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, మేధావులు, మీడియా ప్రతినిధులు,ప్రజాసోదరులందరికీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ, ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సెక్రటరీ కుమార్ రాజా, లైబ్రేరియన్ సునీత,తదితర సిబ్బంది పాల్గొన్నారు.