BREAKING
గంటలో పెళ్లి కాకపోతే వెళ్లిపోతానన్న పంకజ్ కపూర్.. ఆసక్తికర విషయం చెప్పిన సుప్రియా పాఠక్! కోటి సోమవారం వేడుకలకు పోటెత్తిన భక్తజనం పశ్చిమాసియాలో అమెరికా మరో నౌకాదళ మోహరింపు దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం.. యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం వరుసగా మూడు గ్రామ పంచాయతీ సమావేశంలో గైర్హాజరు - 11వ వార్డు సభ్యుడికి అనర్హత నోటీసు ముంబైలో ఛఠ్ పూజ వేడుకల్లో తమన్నా భాటియా.. 'ది వాన్' పాటపై ఆసక్తికర మాటలు! ఎన్విడియా, మైక్రోసాఫ్ట్‌ సహా రెండు డజన్లకు పైగా కంపెనీలకు అమెరికా 'జాతీయ ఛాంపియన్‌' హోదా అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా -- సంక్షేమ పథకాలు అందిస్తున్నాం -- ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి 2001 గుజరాత్ భూకంపం తర్వాత కచ్ పునర్నిర్మాణ అద్భుతం రైతుల సంక్షేమమే లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం - వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ నేను నటినన్న విషయాన్ని పరిశ్రమ మర్చిపోయింది.. దర్శకత్వంపై కష్మీరా షా ఆసక్తికర వ్యాఖ్యలు! బాదంపల్లిలో వివో భవన నిర్మాణానికి భూమి పూజ స్థానిక ఎన్నికలకు టీడీపీ వ్యూహరచన! అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యం - రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారత్‌లో పర్యటిస్తున్న బెలారస్ విదేశాంగ మంత్రి

నరసన్నపేట గాంధీ నగర్ నాలుగులో రోడ్ల ఆక్రమణ...

Select Suryaa Now
నరసన్నపేట గాంధీ నగర్ నాలుగులో రోడ్ల ఆక్రమణ...

 

నరసన్నపేట, నవంబర్16 మేజర్ న్యూస్:    నరసన్నపేట గాంధీనగర్ నాలుగో వీధిలో రహదారులు ఆక్రమణలకు గురవుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాటు చేసిన వీధి రహదారులు కొందరి నిర్లక్ష్యపు వినియోగంతో క్రమంగా కుంచించుకుపోతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు, రోడ్లపైనే మొక్కల పెంపకం, ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్‌తో వీధులు రాకపోకలకు అనువుగా లేకుండా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రజల కోసం.. ప్రైవేటు పార్కింగ్ కోసం కాదు!

ఇళ్ల ముందు ఖాళీ స్థలం ఉన్నా లేకపోయినా కొందరు తమ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లను రోడ్లపైనే నిలిపివేస్తుండటంతో మిగిలిన వారికి దారి లేకుండా పోతోంది. ముఖ్యంగా వీధి చివర నివసించే కుటుంబాలు ఇంటి నుంచి బయటకు రావాలన్నా, తిరిగి ఇంటికి చేరాలన్నా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో రోడ్లకు అడ్డంగా వాహనాలు నిలిపివేయడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లేదా ఇతర వాహనాలు వెళ్లేందుకు కూడా మార్గం ఉండటం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. పోలీసుల వరకు చేరిన వివాదం!

ఇటీవల ఇదే గాంధీనగర్ నాలుగో వీధిలో రోడ్డుపై నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కారు ఢీకొన్న ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేయడం వల్ల ప్రమాదాలు, వివాదాలు చోటుచేసుకుంటున్నాయని వీధివాసులు పేర్కొంటున్నారు.

గ్రామపంచాయతీ అధికారులు ఏం చేస్తున్నట్లు..?

ప్రజా రహదారులపై ఆక్రమణలు జరుగుతున్నా, వాహనాలు అడ్డదిడ్డంగా నిలిపివేస్తున్నా గ్రామపంచాయతీ అధికారులు కనీస స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నప్పుడు పట్టించుకోకపోవడం, ప్రజలకు రాకపోకలు కష్టమైన తర్వాత కూడా స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రహదారులు కొందరి సొంత ఆస్తులు కావు.. అవి అందరి ప్రజా అవసరాల కోసం ఉన్నాయని అధికారులు గుర్తించాలని కోరుతున్నారు.

ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు, పోలీసు శాఖ సంయుక్తంగా గాంధీనగర్ నాలుగో వీధిని పరిశీలించి రహదారులపై ఉన్న ఆక్రమణలను గుర్తించి చట్టప్రకారం తొలగించాలని, రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాల పార్కింగ్‌పై నియంత్రణ విధించి, వీధి మొత్తం ప్రజలకు నిరంతర రాకపోకలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజలు నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితి వస్తే ఇక ఆ రహదారులు ఉన్న ప్రయోజనం ఏమిటి? ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలకు కారణమవుతున్న ఆక్రమణలు, అడ్డదిడ్డమైన పార్కింగ్‌ను ముందుగానే అరికట్టడం అధికారుల బాధ్యత కాదా? అని గాంధీనగర్ నాలుగో వీధి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.