BREAKING
పేదల జీవితాల్లో ఆసరా పెన్షన్ - లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూర్య 'సీన్' బాక్సాఫీస్ జోరు.. పది రోజుల్లోనే రూ.136.50 కోట్లు దాటి రికార్డు! దుర్గారావు పరామర్శించిన జక్కంపూడి దేశంలో పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం అంగన్వాడి సెంటర్స్ లో పిల్లలకు,ప్లేట్స్ గ్లాసుల పంపిణీ  విడాకులకు ముందు కమల్, సారిక మధ్య ఎంతో లోతైన ప్రేమ ఉండేది.. శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత వాయుసేన అమ్ములపొదిలోకి దేశీయ తేజస్ మార్క్-1ఏ చెరువులు కుంటలలో మరమ్మత్తు పనులు చేపట్టాలి బిఆర్‌టి నగర్ 8వ వార్డు అభ్యర్థిగా దొడ్డి నరేంద్ర నామినేషన్. అనకాపల్లి, నవంబర్ 16, మేజర్ బాల్కొండ లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర ప్రతి పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది ఆస్కార్ ఎంపిక తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను.. గోంధాల్ దర్శకుడు సంతోష్ దవాఖర్! వరి సాగుకు స్వస్తి.. నీటి పొదుపు పంటలే శ్రేయస్కరం - ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ వెంకన్న ఆలయానికి కార్తీక శోభ పోటెత్తిన భక్తజనం నిత్య అన్నదాన పథకానికి విరాళం

అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా -- సంక్షేమ పథకాలు అందిస్తున్నాం -- ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా -- సంక్షేమ పథకాలు అందిస్తున్నాం -- ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
సూర్య మోపాల్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన చేయూత పెన్షన్ పథకం మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోపాల్ మండలానికి చెందిన 425 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో కేవలం కాగితాలకే పరిమితమైన పెన్షన్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రజాపాలనలో నిజమైన లబ్ధిదారులకు చేరువ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. పెన్షన్ల పంపిణీలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులకు నెలకు రూ.4 వేల చొప్పున, ఇతర అర్హులైన లబ్ధిదారులకు రూ.2 వేల చొప్పున పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.చివరిగా పెన్షన్ మంజూరు పత్రాలు అందుకున్న 425 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మోపాల్ మండల అధ్యక్షులు రవి, పార్టీ నాయకులు జలంధర్ రెడ్డి, యాదగిరి, DRDO PD సాయన్న, మండల ప్రత్యేక అధికారి ప్రసాద్, ఎంపీడీఓ, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.