BREAKING
ఆస్కార్ ఎంపిక తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను.. గోంధాల్ దర్శకుడు సంతోష్ దవాఖర్! వరి సాగుకు స్వస్తి.. నీటి పొదుపు పంటలే శ్రేయస్కరం - ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ వెంకన్న ఆలయానికి కార్తీక శోభ పోటెత్తిన భక్తజనం నిత్య అన్నదాన పథకానికి విరాళం గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా జి.రామాంజనమ్మ నామినేషన్ దాఖలు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భూభారతి భూ సర్వేకు రైతులు సహకరించాలి - తహశీల్దార్ సాయి భుజంగరావు ముంబైలో సచిన్ టెండూల్కర్‌తో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ సందడి రామాయణ సక్సెస్‌పై ధనుష్ ప్రశంసలు.. సాయి పల్లవి ఆసక్తికర రిక్వెస్ట్! నేడు చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులు. - సర్వే నంబర్‌ 401 భూములు నిషేధిత జాబితాలోనే - భూములున్నా హక్కులు లేవు.. అమ్ముకోలేరు.. కొనలేరు..! గంటలో పెళ్లి కాకపోతే వెళ్లిపోతానన్న పంకజ్ కపూర్.. ఆసక్తికర విషయం చెప్పిన సుప్రియా పాఠక్! కోటి సోమవారం వేడుకలకు పోటెత్తిన భక్తజనం పశ్చిమాసియాలో అమెరికా మరో నౌకాదళ మోహరింపు దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం.. యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యం - రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యం - రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సూర్య సైదాపూర్ : హుస్నాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచితంగా సహాయక ఉపకరణాలు అందించేందుకు అలింకో సంస్థ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను సోమవారం సైదాపూర్ మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన వారందరినీ గుర్తించి కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు, చేతి కర్రలు, వీల్‌చైర్లు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. నవంబర్ 16న సైదాపూర్‌లో ప్రారంభమైన శిబిరాలు 17న ఎల్కతుర్తి, 18న భీమదేవరపల్లి, 20న కోహెడ, 21న చిగురుమామిడి, 25, 26, 27 తేదీల్లో హుస్నాబాద్ మండలం, పట్టణంలో నిర్వహించి అనంతరం అక్కన్నపేటలో కూడా చేపడతామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అర్హులను శిబిరాలకు తీసుకురావాలని సూచించారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 5 వేలకుపైగా కొత్త పెన్షన్లు మంజూరు చేశామని, అర్హత ఉండి పెన్షన్ రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. 360 డిగ్రీల పరిశీలన అనంతరం రాజకీయాలకు అతీతంగా అర్హత ఆధారంగా పెన్షన్లు అందిస్తున్నామని, పెన్షన్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగే దళారులను నమ్మవద్దని హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. చేయూత పథకం లబ్ధిదారులు అపోహలకు గురికావద్దని, ప్రతి దరఖాస్తును వ్యక్తిగతంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని తెలిపారు. లబ్ధిదారుల వివరాల నమోదు, స్క్రీనింగ్ కోసం ప్రత్యేక EDM సాంకేతిక ఏర్పాట్లు చేశామని, ఆధార్ లేదా సదరం సర్టిఫికెట్ లేని వారికి వాట్సాప్ ద్వారా ప్రింట్లు పొందే అవకాశం కల్పించామని వివరించారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే సుమారు 14 వేల మందికి స్క్రీనింగ్ పూర్తి చేసి ఆమోదం తెలిపామని, డిసెంబర్‌లో రెండో విడత వెరిఫికేషన్ చేపడతామని చెప్పారు. ఎంపీడీవో స్థాయిలో తిరస్కరించిన దరఖాస్తులపై డీఆర్‌డీఓ స్థాయిలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అలింకో ప్రతినిధులు, జిల్లా అధికారులు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.