telangana
వరుసగా మూడు గ్రామ పంచాయతీ సమావేశంలో గైర్హాజరు - 11వ వార్డు సభ్యుడికి అనర్హత నోటీసు
సూర్య బాల్కొండ /మెండోరా : మెండోరా మండలం పోచంపాడ్ గ్రామపంచాయతీ వార్డు సభ్యుడికి జిల్లా పంచాయతీ అధికారి నోటీసులు నిజామాబాద్ జిల్లా మెండోర మండలం పోచంపాడ్ గ్రామపంచాయతీలో వరుసగా మూడు సాధారణ సమావేశాలకు గైర్హాజరైన 11వ వార్డు సభ్యుడు శ్రీ అల్ల భాస్కర్‌కు జిల్లా పంచాయతీ అధికారి అనర్హత నోటీసులు జారీ చేశారు.తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని నిబంధనల ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2026 జూలై 3, ఆగస్టు 3, సెప్టెంబర్ 2 తేదీల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ సాధారణ సమావేశాలకు ఆయన హాజరుకాలేదని నోటీసులో వివరించారు.జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి నవంబర్ 16న జారీ చేసిన ఉత్తర్వుల్లో సమావేశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సమావేశాల ఎజెండా నోటీసులను జూలై 1, జూలై 31, ఆగస్టు 29 తేదీల్లో జారీ చేయగా, సమావేశాలు వరుసగా జూలై 3, ఆగస్టు 3, సెప్టెంబర్ 2 తేదీల్లో నిర్వహించినట్లు పేర్కొన్నారు.తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 25(డి), సెక్షన్ 27(1) నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.