03 సూర్య కరీంనగర్ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా, వారు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరు, జూబ్లీ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్రాల నిర్వాహకులకు ఆదేశించారు.రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా విక్రయించుకోవాలని ఆయన సూచించారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తామని ఆకుల నరసన్న పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో.కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి . సొసైటీ సీఈఓ రమేష్, జూబ్లీ సర్పంచ్ కమలాకర్ గౌడ్ నగనూరు సర్పంచ్ సాయిళ్ల శ్రావణి మహేందర్, ఉప సర్పంచ్ మరియు రైతులు హమాలీలు నాయకులు పాల్గొన్నారు