నలుగురి కార్పొరేటర్ లను గెలిపించాను... సీఎం చంద్రబాబుకు వివరించిన 'పులుగోరు'
తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు నలుగురు కార్పొరేటర్ లను గెలిపించాలని ఆదేశించిందని, తనకు అప్పగించిన నలుగురు కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టిడిపి సీనియర్ నేత, కోపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి వివరించారు. గురువారం తిరుమల పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను తిరుపతిలోని వ్యవసాయ కళాశాల హెలిపాడ్ వద్ద పులిగోరు మురళీకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి తాను గెలిపించిన భారీ మెజారిటీతో గెలిపించిన నలుగురు కార్పొరేటర్ల అభ్యర్థుల వివరాలను తెలియజేశారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ నాకు తెలుసు మురళి... రాబోయే రోజులలో నీకు అంత మంచే జరుగుతుంది అంటూ పులుగోరు మురళి కృష్ణారెడ్డిని ఆప్యాయంగా గుర్తు చేశారు. సీఎంను కలిసిన వారిలో కార్పొరేటర్లు ఈతమాకుల హేమంత్ యాదవ్, షేక్ నసీమున్నిసా, గంజి సుధాకర్ రెడ్డి, ఆర్ నాగభూషణం ముని రామయ్య, టిడిపి తిరుపతి పార్లమెంటు కార్యదర్శి ముని రామయ్య లు ఉన్నారు.
H. ద్వారకా, స్టాఫ్ రిపోర్టర్
9705347341.