నారాయణస్వామి అభిషేకపూజల్లో ఇఓ నరసింహబాబు
సిఎస్ పురం,మేజర్ న్యూస్,,ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానం నందు ఆదివారం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీగిరిరాజు నరసింహబాబు స్వామివారి అభిషేకం పూజల్లో పాల్గొని అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈసందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు యం.ప్రసాదుశర్మ కార్యనిర్వాహణాధికారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.అనంతరం దేవస్థానం ఆవరణలో భక్తులకు ఇబ్బందులు లేకుండా కల్పిస్తున్న వసతులను ఈఓ పర్యవేక్షించారు.