BREAKING
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ 'డ్రాగన్'లో మరో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్: నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంట్రీ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ రోజున వేతనంతో కూడిన సెలవు

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ రోజున వేతనంతో కూడిన సెలవు

విజయవాడ మేజర్ న్యూస్ : జిల్లాలో నవంబర్ 1వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల సాధారణ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, వాణిజ్య, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1316 (మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ), కార్మిక శాఖ సవరించిన ఆదేశాల మేరకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దుకాణాలు, సంస్థల చట్టం–1988 నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని అన్ని దుకాణాలు, వాణిజ్య, ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు తమ ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు తప్పనిసరిగా కల్పించాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను యాజమాన్యాలన్నీ కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.