BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

ముగిసిన నారాయణ ప్రీమియర్ లీగ్ -బాణసంచా వెలుగుల్లో విద్యార్థుల సందడి -చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం: జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు -ముగింపు వేడుకల్లో 5 వేల మంది విద్యార్థులు ఫ్లాష్ మాబ్ తో ఆకట్టుకున్న నారాయణ

Select Suryaa Now
ముగిసిన నారాయణ ప్రీమియర్ లీగ్  -బాణసంచా వెలుగుల్లో విద్యార్థుల సందడి -చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం: జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు  -ముగింపు వేడుకల్లో 5 వేల మంది విద్యార్థులు ఫ్లాష్ మాబ్ తో ఆకట్టుకున్న నారాయణ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : నారాయణ వంటి కార్పొరేటు విద్యాసంస్థలలో చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరమని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురంలో నారాయణ పాఠశాలలో రెండు రోజులు పాటు నిర్వహించిన జిల్లా స్థాయి అంతర్ కళాశాల క్రీడా పోటీలు నారాయణ ప్రీమియర్ లీగ్-2026 ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు బాణసంచా వెలుగులుతో సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండుగ జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు హాజరై విద్యార్థులు తమ ప్రతిభ పాటవాలను అద్భుతంగా ప్రదర్శించారని కొనియాడారు. నారాయణ విద్యాసంస్థలో నాణ్యమైన విద్యుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు.క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రీడా స్ఫూర్తి అలవడి, గెలుపు ఓటములను జీవితంలో సమానంగా స్వీకరించాలన్నారు. నారాయణ డిజిఎం కొండలరావు మాట్లాడుతూ తమ విద్యార్థులు జేఈఈ, నీట్ వంటి వాటిలో జాతీయ స్థాయిలో టాప్ 100, టాప్ 1000 ర్యాంకులు సాధించారని తెలియజేశారు. క్రీడల్లోనూ జాతీయస్థాయిలో పాల్గొనేలా ప్రోత్సాహామిస్తూ అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఒలింపిక్ హాకీ క్రీడాకారిణి రజని మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్నిస్తాయని, క్రీడలు జీవితంలో ఒక భాగం కావాలన్నారు. ఎస్వియూ రిజిస్టర్ భూపతి నాయుడు మాట్లాడుతూ క్రీడాకారులు జాతి సంపదని పేర్కొన్నారు. అనంతరం నారాయణ విద్యాసంస్థల డిజిఎం కొండలరావును జ్ఞాపకతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కోర్ డీన్ శ్రీనివాసరావు, డీన్లు సురేష్, వేణుగోపాల్, చక్రవర్తి, రమేష్, ఏజీఎంలు శ్రీనివాసులు, ఫణి, ప్రిన్సిపల్స్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, దాదాపు 5 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 100 మందికి పైగా పాల్గొన్న ఫ్లాష్ మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్