మృతుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి పరామర్శ.. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆత్మీయ పలకరింపు
బల్లికురవ మేజర్ న్యూస్: మండలంలోని కొణిదెన,ముక్తేశ్వరం గ్రామాల్లో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం పర్యటించారు.కొణిదెన గ్రామానికి చెందిన పల్లపు కోటేశ్వరరావు క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడంతో ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి,కోటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అనంతరం ముక్తేశ్వరం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న అట్లూరి నాగేశ్వరరావు నివాసానికి మంత్రి వెళ్లి ఆయనను పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.