BREAKING
సీతారామభద్ర క్షేత్ర నిర్మాణానికి రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ వీరాళం అంగన్‌వాడీ కార్యకర్తలకు ‘పోషణ్‌ భీ పఢాయీ భీ’పై రెండో రోజు శిక్షణ అంతర్జాతీయ మార్కెట్ కోసం అరకు కాఫీని సేకరించండి. -ఎస్ఎల్ఎన్ కాఫీ చైర్మన్ శతప్పన్ తో భేటీలో మంత్రి నారా లోకేష్ ప్ర‌తిపాద‌న‌. భూముల రీసర్వేను వేగవంతం చేయాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కార్యకర్తల చేరికలు.. -- లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతిపై కేంద్రం నిషేధం: 'బ్లాక్ మాస్' ఎగుమతులకు బ్రేక్ రామాయణంలో ఇంద్రుడి పాత్రతో థాయ్‌లాండ్‌లో కునాల్ కపూర్ క్రేజ్.. ఆకట్టుకుంటున్న విదేశీ అభిమానుల కవితలు విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి – అదనపు ఎస్పీ సత్యనారాయణ మండలంలో విస్తృతంగా పర్యటించిన బీజేపీఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డ్వాక్రా గ్రూపులు-ఏపీ ఉత్ప‌త్తులకు వాల్ మార్ట్‌, ఫ్లిఫ్‌కార్ట్ స‌ప్లై చైన్ల‌లో చేర్చండి. -వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్‌తో భేటీలో మంత్రి లోకేష్ ప్ర‌తిపాద‌న‌. ఈ నెల 15న హైదరాబాదులో జరిగే "హలో నేతకాని చలో ఉస్మానియా" పోస్టర్ల విడుదల ఆసియాన్ అంటే ఏమిటి? ప్రాంతీయంగా ఈ కూటమి ఎందుకు అత్యంత కీలకం? సీఐఐ 31వ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేష్ భారతదేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో గణనీయమైన పెరుగుదల: రూ. 14 లక్షల కోట్ల మార్కు దాటిన ఆదాయం ఆపదలో ఉన్న ఖాతాదారుడి కుటుంబానికి గాయత్రి బ్యాంకు ఆర్థిక భరోసా

మండల పరిషత్ పరోక్ష ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి

Select Suryaa Now
మండల పరిషత్ పరోక్ష ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి

విజయవాడ, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలో మండల ప్రజా పరిషత్‌లకు సంబంధించి కో-ఆప్టెడ్ సభ్యులతో పాటు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి. సుశీల ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం విజయవాడలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ పి. సుశీల మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు తమ బాధ్యతలను పూర్తి అవగాహనతో, అప్రమత్తంగా నిర్వర్తించాలని తెలిపారు. కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికతో పాటు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలకు సంబంధించిన విధివిధానాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. ఎన్నికల నోటీసుల జారీ, సమావేశాలకు అవసరమైన కోరం నిర్ధారణ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, ఓటింగ్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అధికారులకు వివరించారు. సమాన ఓట్లు వచ్చిన సందర్భంలో లాటరీ ద్వారా విజేతలను నిర్ణయించే విధానం, రాజకీయ పార్టీల అభ్యర్థుల అధికారిక గుర్తింపు పత్రాలు, పార్టీ విప్ జారీ, అమలు, ఎన్నికల సమావేశాల నిర్వహణ, ఫలితాల ప్రకటన, రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను సజావుగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి, తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించి ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడానికి కృషి చేయాలని సీఈఓ పి. సుశీల సూచించారు.




స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.