BREAKING
సైనిక సన్నద్ధతలో ఆశ్చర్యకరమైన వ్యూహాలు, సాంకేతిక ఆధిక్యతే కీలకం పొన్నూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత...... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పలమనేరు గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు పలు విజ్ఞాన కార్యక్రమాలు అండర్-19 ఆసియాకప్‌ ఫైనల్‌కు భారత్.. అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలురాయి తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధికి సైయంట్ సుముఖత. -సైయంట్ ప్రెసిడెంట్ నరసింహంతో మంత్రి నారా లోకేష్ సమావేశం శివాలయంలో ఎమ్మెల్యే జన్మదినోత్సవం ఈ నెల 15న హైదరాబాదులో జరిగే "హలో నేతకాని చలో ఉస్మానియా" పోస్టర్ల విడుదల కెమెరాలు తక్కువగా, అనుబంధాలు బలంగా ఉండేవి...ప్రధాని మోదీ జర్నలిస్టులతో జ్ఞాపకాలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ 2026లో అధికార పార్టీ ఒత్తిళ్లను ఎదుర్కొని వైసీపీ వీరోచిత పోరు... 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి* *సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అరటి సాగులో జీవ నియంత్రణ కారకాలపై అవగాహన

చిన్నారుల్లో నిమోనియా కట్టడికి ప్రత్యేక కార్యాచరణ.. గోడపత్రికను ఆవిష్కరించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి. వెంకటేశ్వర్లు

Select Suryaa Now
చిన్నారుల్లో నిమోనియా కట్టడికి ప్రత్యేక కార్యాచరణ.. గోడపత్రికను ఆవిష్కరించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి. వెంకటేశ్వర్లు

సూర్య న్యూస్ ఒంగోలు.

ఐదేళ్లలోపు చిన్నారుల్లో నిమోనియా వ్యాధిని అరికట్టే లక్ష్యంతో నవంబర్ 12 నుండి ఫిబ్రవరి 28, 2027 వరకు నిర్వహించనున్న ప్రత్యేక అవగాహన మరియు నివారణ కార్యక్రమం గోడపత్రికను జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ టి. వెంకటేశ్వర్లు గురువారం ఆవిష్కరించారు. ఒంగోలులోని తన ఛాంబర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నిమోనియా వ్యాధి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల్లో జలుబు, దగ్గు తీవ్రం కావడం, అధిక జ్వరం, వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకునేటప్పుడు పక్కటెముకలు (డొక్కలు) లోపలికి ఎగరవేయడం, ముక్కుపుటాలు ఎగరవేయడం, పాలు తాగలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిమోనియాగా అనుమానించాలని డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే శిశు మరణాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ఈ నెల 12 నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు వైద్య సిబ్బంది గృహ సందర్శనలు నిర్వహిస్తారని, పిల్లల్లో పై లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆశా వర్కర్లు లేదా ఏఎన్ఎంల ద్వారా సత్వర చికిత్స అందించాలని కోరారు.నిమోనియా నివారణ కోసం ప్రభుత్వం చిన్నారులకు ఉచితంగా న్యూమోనియా వ్యాక్సిన్ (PCV) అందిస్తోందని, దీనిని తప్పనిసరిగా వేయించడంతో పాటు పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ బాలాజీ, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ, ఎఫ్‌డీపీ నోడల్ అధికారి డాక్టర్ శ్రావణ్, సాన్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నబీవల్లి, జిల్లా మాస్ మీడియా అధికారులు బెల్లం నరసింహారావు, డి. శ్రీనివాసులు, విక్టర్ బాబు, జవహర్ తదితర వైద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.