శివాలయంలో ఎమ్మెల్యే జన్మదినోత్సవం
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి 85వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ అగస్తేశ్వర స్వామి వారి సన్నిధిలో దేవాలయ చైర్మన్ వి. నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మున్సిపల్ చైర్మన్ ఎన్. రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులకు ఫలాలు అందించి, ఆశీర్వచనాలు పొందారు. అనంతరం కేక్ కటింగ్ చేసి, శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి కి 85వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సుదీర్ఘ ప్రజాసేవ, ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో, మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.