BREAKING
ఫీజులు చెల్లించాలని వేధింపులు పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది.. ‘ఈఎన్ఈ రిపీట్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ విశేషాలు! రాష్ట్రంలో రెండో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కియా ఒప్పందం : రూ.18,811 వేల కోట్ల పెట్టుబడి, మరో 12 వేల మందికి ఉద్యోగావకాశాలు భోగాపురం ఎంపీపీ పీఠంపై మళ్లీ ఉత్కంఠ! అయ్యప్ప దీక్ష పవిత్రమైనది లిటిల్ హార్ట్స్ కంటే పెద్ద విజయం సాధించాలి.. ‘DNK’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరో శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలి :మున్సిపల్ కమీషనర్ మార్కాపురం జిల్లాలో నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం బాలల దినోత్సవ కానుకగా నవంబర్ 14న ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ.150కే సినిమా టికెట్! రైతు ఉత్పత్తిదారుల సంఘానికి నూతన భవన నిర్మాణానికి అడుగులు! బెంగళూరులో ప్రముఖులతో శ్రీరామ్ చినబాబు ప్రత్యేక భేటీ : తంగాల వేణుగోపాల్‌,రఘురామ కృష్ణమరాజు,గురజాల జగన్మోహన్ లతో ఆత్మీయ సమావేశం ఘనంగా ప్రారంభమైన బొగ్గు నాణ్యత వారోత్సవాలు 2026 అద్దంకిలో రైస్ మిల్లులను డీఎస్ఓ ఆకస్మిక తనిఖీ.లు క్రీడాకారులకు అభినందనలు

యానాది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ

Select Suryaa Now
యానాది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ

పెద్దపంజాణి, మేజర్ న్యూస్:
 

 యానాది గిరిజన మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, స్వయం ఉపాధి ద్వారా తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనే సదుద్దేశంతో లిన్సీ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో రోప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుపని శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.రోప్స్ సంస్థ చైర్మన్ ధనశేఖరన్ ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గం లోని దేవలంపేట, దొడ్డిపల్లి మరియు బైరెడ్డిపల్లి పరిధిలోని తిమ్మయ్యగారిపల్లి మూడు గ్రామాల్లోని గ్రామ పెద్దలు, స్థానిక పంచాయతీ అధికారులు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి యానాది మహిళలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పలమనేరు నియోజకవర్గంలోని దేవలంపేట, దొడ్డిపల్లి మరియు బైరెడ్డిపల్లి పరిధిలోని తిమ్మయ్యగారిపల్లి గ్రామాలకు చెందిన ఎంపిక చేసిన పేద యానాది గిరిజన మహిళా లబ్ధిదారులకు ఒక్కో గ్రామానికి మూడు చొప్పున మొత్తం తొమ్మిది కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఆరు నెలల పాటు కుట్టుపని శిక్షణ అందించేందుకు మూడు గ్రామాలకు ముగ్గురు అనుభవజ్ఞులైన మహిళా టైలరింగ్ శిక్షకులను నియమించారు.
ఈ సందర్భంగా రోప్స్ సంస్థ మేనేజర్ పౌలురాజ్ మాట్లాడుతూ, ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళలకు కుట్టుపనిలో ప్రాథమిక స్థాయి నుంచి వృత్తిపరమైన నైపుణ్యాలను నేర్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం మహిళలు స్వయంగా దుస్తులు కుట్టుకోవడంతో పాటు, టైలరింగ్‌ను ఉపాధి మార్గంగా ఎంచుకొని నిరంతర ఆదాయం పొందేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.రోప్స్ సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ గిరిజన మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.మరో ప్రోగ్రామ్ ఆఫీసర్ గీతాంజలి మాట్లాడుతూ మహిళల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, మహిళా సాధికారత మరియు గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం రోప్స్ సంస్థ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధీర్, జగమర్ల గ్రామనివాసి ధనుంజయరెడ్డి, రోప్స్ సంస్థ సిబ్బంది దివ్య, వెంకటేష్, వినాయక, సిద్ధు తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి