తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధికి సైయంట్ సుముఖత. -సైయంట్ ప్రెసిడెంట్ నరసింహంతో మంత్రి నారా లోకేష్ సమావేశం
సూర్య స్టేట్ బ్యూరో.
విశాఖపట్నం: సైయంట్ ప్రెసిడెంట్ & హెడ్ ఆఫ్ కార్పోరేట్ ఫంక్షన్స్ డాక్టర్ పీఎన్ఎస్వీ నరసింహంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... తిరుపతిలో సెమికండక్టర్ పార్క్ అభివృద్ధికి జాయింట్ డెవలప్ మెంట్ మోడల్ ను పరిశీలించాలని కోరారు. సుమారు 200 ఎకరాల్లో సెమికాన్ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. సైయంట్ ఫౌండేషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మధ్య గత ఏడాది జూన్ లో కుదిరిన ఎంవోయూ, తదనంతర పురోగతిపై చర్చించారు. సైయంట్ ప్రెసిడెంట్ నరసింహం మాట్లాడుతూ... ప్రస్తుతం విశాఖపట్నం (రుషికొండ), కాకినాడలలో సైయంట్ లిమిటెడ్ ఐటీ, ఇంజనీరింగ్ ఎస్ఈజెడ్ క్యాంపస్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. జూన్ 2025లో అమరావతిలో కుదిరిన ఒప్పందం మేరకు విశాఖపట్నంలో సిటీ ఇన్నోవేషన్ క్లస్టర్ ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చెప్పారు. పైలట్ క్లస్టర్ లో 43 ఉన్నత విద్యా సంస్థలు, 270కు పైగా పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. జాయింట్ డెవలప్ మెంట్ మోడల్ లో తిరుపతిలో సెమికాన్ పార్క్ అభివృద్ధికి నరసింహం సుముఖత వ్యక్తం చేశారు.