BREAKING
48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం

అంగన్వాడీలను కనికరించని ప్రభుత్వం --అమలుకు నోచుకోని హామీలు

Select Suryaa Now
అంగన్వాడీలను కనికరించని ప్రభుత్వం    --అమలుకు నోచుకోని హామీలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఐసిడిఎస్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు సహాయకులు తమకు కనీస వేతనాలు ఇవ్వాలని ఇంకా ఇతర  వివిధ సమస్యల పరిష్కారం కోసం అనాదిగా అరిచి గీ పెడుతున్నా,ఆందోళనలు చేస్తున్నా,రికార్డు స్థాయిలో 42 రోజులపాటు సమ్మె చేసినా నాటి ప్రభుత్వంలో ఏమాత్రం ఫలితం ఇవ్వకపోగా నేటి ప్రభుత్వంలో కూడా వారికి ఏ మాత్రం సాయం అందడం లేదని పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం నియమాల మేరకు విద్యార్హతలు కలిగి ఇంటర్వ్యూలలో నెగ్గి అంగన్వాడీ కార్యకర్తలుగా నామమాత్రపు గౌరవ వేతనంతో నియమితులై దశాబ్దాల తరబడి కొనసాగుతుండగా వారికి కనీస వేతనాలు లభించే పరిస్థితి కానరావడం లేదు. ఎన్నెన్నో ఉద్యమాలు, ఆందోళనలు,42 రోజులు పాటు సమ్మె తదితర కార్యక్రమాలు నిర్వహించినా వారికి ఫలితం లభించలేదు. ప్రభుత్వం అనేక యాప్లు రూపొందించి అమలులోకి తేగా అవి సక్రమంగా పనిచేయక ఆన్లైన్లో ఫోటోలు వివరాలు నమోదు కాక గంటలు తరబడి ఇబ్బంది పడుతూ విసిగి వేసారి పోయి  తమ వద్ద ఉన్న ఫోన్లను ప్రభుత్వానికి వాపస్ చేయగా కొత్త ఫోన్లో ని ఇచ్చారే కానీ వారి అసౌకర్యాలు గురించి పట్టించుకోలేదు.దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఉద్యమ బాట పెట్టారు. తరచూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.తరచూ రిలే నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాలు ఎదుట, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ఆందోళనలు చేసినా,వైసీపీ ప్రభుత్వ హయాంలో 42 రోజులు పాటు సమ్మె చేయగా తూతూ మంత్రంగా హామీలు ఇచ్చి ఆ సమ్మెను విరమింప చేశారు,ఆ సమ్మె సమయంలో తెలుగుదేశం నాయకులు తాము అధికారం లోకొస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ కనీస వేతనాలు చెల్లిస్తామంటూ హామీలు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండేన్నారేళ్లు అయినా గాని ఏ మాత్రం వేతనాలు పెంచే పరిస్థితి లేదు. అంగన్వాడీ కార్యకర్తలు కేవలం 11,500 సహాయకులు 7వేల రూపాయలు గౌరవ వేతనం పొందుతున్నారు.పూర్తి సమయం కేటాయించి చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్న అంగన్వాడి కార్యకర్తలు సహాయకులకు కనీస వేతనాలు కూడా లభించడం లేదంటూ 2023 డిసెంబర్లో 12వ తేదీ నుండి 2024 జనవరి 24వ తేదీ వరకు నిరవదిక సమ్మె చేశారు. ధర్నాలు చేశారు. వివిధ రకాల నిరసనలు చేశారు.వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు వివిధ ప్రజాసంఘాలు వారు మద్దతు ఇచ్చారు.సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వారు ఉద్యమించగా ఆనాటి ప్రభుత్వం వాళ్ల బెదిరించి అంగన్వాడీ  కేంద్రాల తాళాలు పగలగొట్టించి, అంగన్వాడీ కార్యకర్తలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి నాడు వైసిపి ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు కాకపోగా నేటి ప్రభుత్వంలో కూడా ఆనాడు నేతలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనాలు చెల్లించాలని వారు సిఐటియు ఆధ్వర్యంలో తరచూ ఆందోళనలకు దిగుతున్నారు.ప్రభుత్వం నాడు హామీ ఇచ్చినా నేడు కనికరించడం లేదని వారు ఆవేదంతో చెబుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినా తరచూ నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడం,ఉద్యమాలను కొనసాగిస్తున్నా ప్రభుత్వం వారిని గురించి పట్టించుకోవడం లేదు.ఇప్పటికైనా నేటి ప్రభుత్వం వారి న్యాయమైన కోర్కెలు ఆమోదించాలని కోరుతున్నారు.